కేసీఆర్, కేటీఆర్... వీరిద్దరూ ఏపి పై, ఏపి ముఖ్యమంత్రి పై చిమ్మిన విషం అంతా ఇంతా కాదు... జగన్ ని సామంతుడిగా చేసుకుకి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏలదాం అనే ప్లాన్ వేసారు. దాని కోసం అన్ని రకాలుగా సాయం చేసారు కూడా. ఇక కేసీఆర్ అయితే రిటర్న్ గిఫ్ట్ ఇస్తా, తొక్క తీస్తా, తోలు తీస్తా అని ఊగుడు మాటలు మాట్లడారు. కేటీఆర్ అయితే ట్విట్టర్ లో చంద్రబాబుని టార్గెట్ చేస్తూ ఎన్నో వ్యాఖ్యలు చేసారు. వందకు వంద శాతం, అక్కడ జగన్ వస్తున్నాడు, చంద్రబాబు ఓడిపోతున్నాడు అంటూ ఎన్నికల ముందు వరకు హడావిడి చేసారు. అయితే, ఎన్నికల తరువాత క్లారిటీ వచ్చిందో ఏమో కాని, మొత్తానికి అందరూ సైలెంట్ అయ్యారు. ఎప్పుడూ చంద్రబాబు పై ఒంటి కాలు మీద వెళ్ళే కేటీఆర్, ఇప్పుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
ఇవాళ నెటిజన్లతో #askktr అనే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆన్ లైన్‌లో నెటిజన్లు అడిగే ప్రతీ ప్రశ్నకు ఆయన జవాబు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సర్వత్ర హాట్ టాపిక్‌గా మారిన ఏపీ రాజకీయాలపై కూడా నెటిజన్లు స్పందించారు. కేటీఆర్‌ను ప్రశ్నలు అడిగారు. ఓ వ్యక్తి ఏపీలో గెలుపు ఎవరిది? మే 23 తర్వాత చంద్రబాబు పరిస్థితి ఏంటి ? అని ఓ ప్రశ్నను కేటీఆర్‌ను అడిగారు. దీనికి స్పందిస్తూ కేటీఆర్ ఆసక్తికరంగా ట్వీట్ చేశారు. తనకు ఏపీ రాజకీయాలపై ఆసక్తి లేదంటూ ట్వీట్ చేశారు. జగన్ ఏపీ సీఎం అవుతారా అని మరో నెటిజన్ అడిగిన ప్రశ్నకు కూడా కేటీఆర్ స్పందించారు. ఏపీ ప్రజలు ఎలాంటి నిర్ణయం ఇస్తారో వేచి చూద్దామని సమాధానమిచ్చారు.
దీంతో కేటీఆర్ చేసిన ఈ ట్వీట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎందుకంటే గతంలో ఎన్నోసార్లు చంద్రబాబుపై విమర్శలు చేసిన కేటీఆర్... ఇప్పుడు ఇలా అనడం ఏంటా అని అందరూ చర్చించుకుంటున్నారు. అంతేకాదు.. జగన్‌కు మద్దతిస్తూ... కేటీఆర్, సీఎం కేసీఆర్ కూడా అనేక సార్లు ప్రత్యక్షంగా పరోక్షంగా వ్యాఖ్యలు కూడా చేశారు. ఎన్నికలకు ముందు హైదరాబాద్‌లో లోటస్ పాండ్‌కు వెళ్లి జగన్‌తో ఫెడరల్ ఫ్రంట్‌పై చర్చలు కూడా జరిపారు కేటీఆర్. చంద్రబాబు కూడా తెలంగాణలో కేసీఆర్, జగన్ దోస్తీలపై విమర్శలు గుప్పించారు. అప్పట్లో అంత బాహటంగా ఏపీ రాజకీయాలపై వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ ఇప్పుడు ఇంత సైలెంట్‌గా ఆసక్తి లేదని చెప్పడం వెనుక, చంద్రబాబు మళ్ళీ సియం అవుతున్నారు అనే సంకేతాలు రావటమే అని తెలుస్తుంది.