ప్రస్తుతం ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎలాంటి అధికారాలూ ఉండవని తాను అన్నట్టుగా ఇటీవల ఒక ఆంగ్ల పత్రికలో వచ్చిన కథనంలో వాస్తవం లేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం సీఎంకు వివరణ ఇచ్చారు. ముఖ్యమంత్రికి అధికారాలు ఉండవని ఎందుకన్నారో వివరణ ఇవ్వాలంటూ, ఆంగ్ల పత్రికలో వచ్చిన కథనాన్ని ప్రస్తావిస్తూ సీఎస్‌కు ముఖ్యమంత్రి నోట్‌ పంపించారు. ఆ పత్రికలో రాసిన కథనంలో తన మాటల్ని వక్రీకరించారని, తాను ఆ మాటలు అననే లేదని సీఎస్‌ తన వివరణలో పేర్కొన్నారు. ఎల్వీ సుబ్రమణ్యం వ్యాఖ్యల పై, యావత్త దేశం ఆశ్చర్యం వ్యక్తం చేసిన సందర్భంలో, తాను ఆ వ్యాఖ్యలు అనలేదు అంటూ, ఆయన చంద్రబాబుకి వివరణ ఇచ్చుకున్నారు.

game 27032019

ఇక మరో పక్క, ద్వివేది కూడా లైన్ లోకి వచ్చారు. మంత్రులు సమీక్షలు చేయవద్దని… తాము చెప్పలేదంటోంది.. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం. ఈ మేరకు వ్యవసాయ శాఖాధికారులకు ఏపీ సీఈవో ద్వివేదీ క్లారిటీ ఇచ్చారు. దీంతో.. మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నిర్వహించే సమీక్షకు వెళ్లాలని వ్యవసాయాధికారులు నిర్ణయించుకున్నారు. మంత్రులు కోడ్ ఉంటే, సమీక్షలు చేయకూడదని ఎక్కడ ఉందో చెప్పాలని సోమిరెడ్డి ఈసీని చాలెంజ్ చేశారు. అంతే కాదు సమీక్షకు రాని, అధికారులు వివరణ ఇవ్వాలని లేఖలు పంపారు. మంత్రి లేఖలతో, కంగారు పడిన అధికారులు ఈ విషయాన్ని ద్వివేది దృష్టికి తీసుకెళ్లారు. సమీక్షకు వెళ్లొద్దని తాము చెప్పలేదన్న ఎన్నికల కమిషన్‌ స్పష్టం చేయడంతో వారికి గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయిది.

game 27032019

దీంతో వెంటనే మంత్రితో టచ్‌లోకి వెళ్లారు. తాము సమీక్షకు వస్తామని వెంటనే ఏర్పాటు చేయాల్సిందిగా మంత్రికి సమాచారం పంపారు. దీంతో సోమిరెడ్డి శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు తన చాంబర్‌లో సమీక్ష ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. వ్యవసాయాధికారులందరూ హాజరయ్యే అవకాశం ఉంది. మొత్తానికి సమీక్షల విషయంలో పోరాటం ఫలించినట్లే కనిపిస్తోంది. ఒక్క సోమిరెడ్డి మాత్రమే కోడ్‌ను పెద్దగా చూపిస్తూ అసలు మంత్రులకు ఎలాంటి అధికారాలు లేవన్నట్లుగా వాదిస్తూ వచ్చిన అధికారులపై ఓ రకంగా తిరుగుబాటు చేశారు. మిగతా మంత్రులంతా సైలెంట్ గా ఉన్నారు. కానీ సోమిరెడ్డి మాత్రం రూల్ బుక్, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ను ముందు పెట్టుకుని సీఈవో, సీఎస్ లను ప్రశ్నించడం ప్రారంభించారు. దాంతో తాము సమీక్షలు చేయవద్దని చెప్పలేదని అధికారులకు క్లారిటీ ఇచ్చింది. మరో పక్క ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చే సోమవారం పోలవరం వెళ్లి క్షేత్ర స్థాయిలో రివ్యూ చెయ్యనున్నారు. ఈ దెబ్బతో పాపం విజయసాయి రెడ్డికి నోట్లో పచ్చి వేలక్కయి పడినట్టు అయ్యింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read