పూజలు, మంత్రాల పేరుతో ప్రజలను మోసం చేయడానికి కొందరు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు. తమ మాట వింటే... సామాన్యులతో పాటు పెద్ద పెద్ద వాళ్లను కూడా మోసం చేయడానికి వీరు ఏ మాత్రం వెనుకాడరు. అలా పూజల పేరుతో ఏకంగా ఓ ఎమ్మెల్యేకే టోకరా వేయబోయిన ఇద్దరు వ్యక్తులు... తమ టైమ్ బాగులేకపోవడంతో కటాకటాలపాలైన ఘటన ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధి ఆమంచి కృష్ణ మోహన్‌‌కు టోకరా ఇచ్చేందుకు ట్రై చేశారు ఇద్దరు వ్యక్తులు. ఎమ్మెల్యేకు నరదిష్టి ఎక్కువగా ఉందని, దిష్టి పోవాలంటే పూజలు చేయాలని చెప్పారు.

koya 3042019

వీరు హైదరాబాద్‌కు చెందిన కోయదొరలుగా పరిచయం చేసుకుని చీరాలలోని ఆమంచి కృష్ణ మోహన్ ఇంటికి వచ్చారు. ఎమ్మెల్యే ఇంటికి వచ్చిన కోయదొరలు చిన్న చిన్న పూజలు చేసి రూ.5వేలు తీసుకున్నారు. ఈ పూజలతో నరదిష్టి పోదని.. మొత్తం నరదిష్టి పోవాలంటే పెద్ద పెద్ద పూజలు చేయాలని నమ్మించారు. అందుకు రూ.12లక్షలు ఖర్చు అవుతుందని చెప్పారు. అంతకుముందు పెద్దపెద్ద సినిమా వాళ్లకు, పేరుమోసిన రాజకీయ నాయకులకు పూజలు చేశామని ఇప్పుడు వారి పరిస్థితి బాగుందని నమ్మించే ప్రయత్నం చేశారు. అనుమానం వచ్చిన ఎమ్మెల్యే ఆమంచి.. ఎవరెవరికి పూజలు చేశారని ప్రశ్నించారు.

koya 3042019

వారు చెప్పిన పేర్లతో అనుమానం వచ్చిన ఆమంచి.. క్రాస్ ఎంక్వైరీ చేశారు. హైదరాబాద్ ఫోన్ చేసి అన్ని వివరాలు తెలుసుకున్నారు. కోయదొరలు మోసగాళ్లు అని భావించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు...ఆ ఇద్దరిని అరెస్ట్ చేసి వారిని కుమారబాబు, సహదేవుడుగా గుర్తించారు. ఎమ్మెల్యే కాకుండా ఇంకెంతమందితో ఇలాంటి పూజల పేరుతో మోసాలకు పాల్పడ్డారనే దానిపై పోలీసులు విచారణ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యే ఆమంచినే నమ్మించగలిగాడు అంటే వాళ్లు మాములోళ్లు కాదంటూ చీరాలలో డిస్కషన్ జరుగుతోంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read