ప్రధాని మోదీ ఇలాఖా వారణాసిలో రాజకీయాలు రంజుగా మారాయి. ఆఖరి క్షణంలో సమాజ్‌వాదీ పార్టీ మోదీపై ఎన్నికల బరిలోకి దింపిన బీఎ్‌సఎఫ్‌ మాజీ జవాన్‌ తేజ్‌ బహదూర్‌ యాదవ్‌కు ఈసీ షాకిచ్చింది. ఎలక్షన్‌ కమిషన్‌ యాదవ్‌కు మంగళవారం నాడు నోటీసులు జారీ చేసింది. షాలినీ యాదవ్ స్థానంలో బీఎస్ఎఫ్ మాజీ జవాన్ తేజ్ బహదూర్ యాదవ్‌కు టికెట్ ఇచ్చి.. ఆ వెంటనే బీఫారం అందజేశారు. వారణాసిలో నామినేషన్ల దాఖలు ఇవాళే చివరి రోజు కావడంతో.. హడావిడిగా తేజ్‌బహదూర్‌తో నామినేషన్ వేయించారు. అయితే నామినేషన్ పత్రాల్లో ఆయన సర్వీస్ నుంచి డిస్మిస్ అయినట్లు పేర్కొనలేదు. ఈ లోపాన్ని కనుగొన్న ఈసీ ఆయనకు నోటీసిచ్చి మే 1వ తేదీలోగా (బుధవారంలోగా) సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.

game 27032019

సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తున్న సైనికులకు సరైన ఆహారం అందడం లేదని, నాణ్యమైన భోజనం దక్కడం లేదని తేజ్ బహదూర్ యాదవ్ ఆరోపించారు. దీంతో ఆయనను ఈ నేరానికి ఆర్మీ డిస్మిస్‌ చేసింది. తరువాత రాజకీయాల్లో చేరిన తేజ్‌ బహదూర్‌కు ఎస్పీ టికెట్‌ ఇచ్చింది. నామినేషన్‌ వేసిన సమయంలో ఆయన తాను సర్వీసు నుంచి తొలగించినట్లు అంగీకరించారు. కానీ తరువాత సమర్పించిన పత్రాల్లో ఆయన ఆ విషయాన్ని పేర్కొనలేదు. నిబంధనల ప్రకారం... అవినీతి , దేశద్రోహ ఆరోపణల మీద సర్వీసు నుంచి డిస్మిసైన వారు ఐదేళ్ల పాటు ప్రచారానికి అనర్హులు. భోజనం బాగులేదని అసత్య ఆరోపణలు చేసి సైన్యం పరువు దిగజార్చడానికి ఆయన ప్రయత్నించినట్లు కోర్టు మార్షల్‌లో ఆర్మీ నిర్ధారించి ఆయనను ఉద్యోగం నుంచి తొలగించింది.

game 27032019

ఆయన చేసిన ఆరోపణ దేశద్రోహం కిందకు వస్తుందన్నది ఈసీలో ఓ వర్గం అభిప్రాయం. అయితే నిజం చెప్పినందుకు తనను బలిపశువును చేశారని , దీనిపై తాను సుప్రీంకోర్టులో న్యాయం కోరతాననీ తేజ్‌ బహదూర్‌ చెబుతున్నారు. తేజ్‌ బహదూర్‌ ఇచ్చే సమాధానాన్ని బట్టి ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకోనుందనేది ఆధారపడి ఉంది. ఆయన ఇచ్చే సమాధానం బట్టే నామినేషన్‌ను ఆమోదించాలా లేక తిరస్కరించాలా అన్న విషయంపై ఈసీ నిర్ణయం తీసుకోనుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read