ప్రధానమంత్రి నరేంద్రమోదీపై ప్రకాశం జిల్లా పామూరు మండలానికి చెందిన కె రవికిరణ్‌శర్మ, శ్రీనివాసులు ఇరువురు తమ మద్దతుదారులతో కలిసి సోమవారం వారణాసిలోని కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. ఇరువురికి స్థానికంగా ఉండే లాయర్లు, మేధావి వర్గం వారు మద్దతును ఇచ్చి నామినీలుగా కూడా పలువురు మద్దతు తెలిపినట్లు వారణాసి ఎంపీ అభ్యర్థులు అయిన రవికిరణ్‌శర్మ, శ్రీనివాసులు తెలిపారు. కనిగిరి ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను, వెలుగొండ ప్రాజెక్టు ప్రాముఖ్యతను ప్రచారం ద్వారా వివరిస్తున్నామన్నారు. తమతోపాటు తెలుగు రాష్ట్రాల నుంచి అనేక మంది మోదీపై నామినేషన్ వేసేందుకు తరలి వచ్చారన్నారు.

modi 30042019

పలువురిని నామినేషన్ దాఖలు చేయడానికి రానివ్వకుండా పలువురు అడ్డుకున్నారని వారు పేర్కొన్నారు. తాము గెలుపుకోసం పోటీ చేయలేదని కనిగిరి ప్రాంతంలో కిడ్ని , ఫోరైడ్ సమస్యతో బాధపడుతున్నారని, ఈ సమస్యలను జాతీయ స్థాయిలో తెలియజేసేందుకు తాము పోటీలో నిలిచినట్లు వారు తెలిపారు. పోలింగ్ జరిగే వరకు తాము వారణాసిలో ఉంటామన్నారు. మరో పక్క, నరేంద్ర మోదీపై పోటీ చేసేందుకు వారణాసికి బయలుదేరివెళ్లిన నిజామాబాద్ జిల్లా పసుపు రైతులు అడుగడుగునా ఆటంకాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. తాము మూకుమ్మడిగా నామినేషన్లు దాఖలు చేయకుండా పోలీసులు, అధికారులు అడ్డుకున్నారని ఆరోపిస్తూ స్థానిక రైతులు సోమవారం వారణాసిలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని, పంటకు మద్దతు ధర కల్పించాలనే డిమాండ్‌తో జాతీయ పార్టీల దృష్టిని ఆకర్షించేందుకు వీలుగా ఈ నెల 25వ తేదీన నిజామాబాద్ నుండి సుమారు 45మంది రైతులు వారణాసికి తరలివెళ్లిన విషయం విదితమే.

modi 30042019

నిజామాబాద్ నియోజకవర్గంలో మూకుమ్మడిగా నామినేషన్లు దాఖలు చేయడం చర్చనీయాంశమైనప్పటికీ, ఆశించిన ఫలితం సమకూరలేదనే భావనతో ఏకంగా ప్రధాని మోదీపై మూకుమ్మడిగా పోటీకి దిగితే తమ సమస్య పట్ల మరింత చర్చ జరుగుతుందని భావించిన రైతులు అనేక వ్యయప్రయాసాలు కోర్చి వారణాసికి చేరుకున్నారు. అయితే అక్కడి అధికారులు దక్షిణాది రైతులకు సహకరించకపోగా, మూకుమ్మడిగా నామినేషన్లు దాఖలు చేయనివ్వకుండా అడ్డంకులు సృష్టించారని అన్నదాతలు వాపోతున్నారు. తాము 26వ తేదీన వారణాసికి చేరుకున్న నాటి నుండే తమను పోలీసులు నీడలా వెంటాడుతూ, తమ నామినేషన్లను బలపర్చేందుకు ముందుకు వచ్చిన మద్దతుదారులను బెదిరింపులకు గురి చేశారని రైతులు ఆరోపిస్తున్నారు. తమతో పాటు తమిళనాడుకు చెందిన రైతులను సైతం నామినేషన్లు వేయకుండా అక్కడి పోలీసులు, అధికారులు కావాలనే అడ్డంకులు సృష్టించారని, వీటిని నిరసిస్తూ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించడం జరిగిందని వివరించారు. తాము గంట పాటు నిరసన తెలిపినప్పటికీ, ఏ ఒక్క అధికారి కూడా వచ్చి సమస్య ఏమిటంటూ ఆరా తీయలేదన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read