మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఈ హైదరాబాద్ బ్యాచ్ నుంచి దాడి కొనసాగుతూనే ఉంది. హైదరాబాద్ నుంచి ఎంత మంది దాడి చేస్తున్నారో చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు తాజగా రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు తయారయ్యారు. ఇందులో బీజేపీలో చేరిన ఐవైఆర్, జగన్ ముసుగు వేసుకుని తిరుగుతున్న అజయ్ కల్లం కూడా ఉన్నారు. చంద్రబాబు ఎలక్షన్ కమిషన్ పై పోరాడుతూ, కేంద్రం ఆడుతున్న ఆటలను బహిరంగ పరుస్తూ, వీళ్ళు ఆడుతున్న నాటకాలు మీడియా ముందు చెప్పే క్రమంలో, ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీని మార్చిన విధానం గురించి చెప్పుకొచ్చారు., ఆ సమయంలో, ప్రస్తుతం వేసిన చీఫ్ జస్టిస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం గురించి కొన్ని వ్యాఖ్యలు చేసారు. ఆయన జగన కేసుల్లో A10 అనే విషయం అందరికీ తెలిసిందే. ఈ విషయం ప్రస్తావిస్తూ, ఆయన పై కొన్ని వ్యాఖ్యలు చేసారు.
ఎన్నికల రోజున, హింస చెలరేగి, పోలీసులు అప్రమత్తం అయిన వేళ, ఎల్వీ సుబ్రహ్మణ్యం వెళ్లి డీజీపీ దగ్గర రెండు గంటల కూర్చుని, వాళ్ళని పని చేసుకోకుండా చేసిన విధానాన్ని ప్రశ్నిస్తూ, కోవర్ట్ అనే పదం చంద్రబాబు వాడారు. ఈ విషయం పై, ఐవైఆర్ కృష్ణా రావు, అజయ్ కల్లం, మరి కొంత మంది పాపం బాగా హార్ట్ అయ్యారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై చర్య తీసుకోవాలని గవర్నర్‌కు రాజ్‌భవన్‌లో మంగళవారం వినతిపత్రం అందజేశారు. ఏపీ సీఎం వ్యాఖ్యలు ఉద్యోగుల నైతికతను దెబ్బతీశాయన్నారు. ఎన్నికల కమిషన్ ముగ్గురు అధికారుల పేర్లలో నుంచి సమర్థుడైన అధికారిగా భావించడం వల్లే సుబ్రహ్మణ్యంను ముఖ్య కార్యదర్శిగా నియమించిందని పేర్కొన్నారు.
ఇదివరకు ఆయనపై రాజకీయ కుట్రలో భాగంగానే కేసులు బనాయించారని గోపాల్‌రావు తెలిపారు. ఎన్నికల సమయంలో ముఖ్య ఎన్నికల అధికారి కార్యాలయం ముందు బైఠాయించిన సందర్భంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు అధికారుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీశాయని విచారం వ్యక్తం చేశారు. ఇవే విషయాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఈ ఉదంతంపై చంద్రబాబుతో క్షమాపణలు చెప్పించాలని డిమాండ్ చేశారు. అయితే ఇదంతా బాగానే ఉంది కాని, ఇదే స్పందన విజయసాయి రెడ్డి, జగన్, ఐఏఎస్, ఐపీఎస్ ల పై ఆరోపణలు చేసినప్పుడు, సాక్షిలో విషయం చిమ్మినప్పుడు ఏమైంది ? ఐపీఎస్ ఆఫీసర్లకు కులాన్ని ఆపాదించి మరీ చేసిన వ్యాఖ్యలు, వీళ్ళకు కనిపించలేదా ? అంటే ఇదంతా ఎదో రాజకీయ పార్టీ చెయ్యమంటే చేస్తున్నారా అనే అనుమనాలు కలుగుతున్నాయి.