ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై, అధికారుల పై కులం అంటగట్టి, జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న నీచ రాజకీయం రోజు రోజుకీ ఎక్కువ అవుతుంది. దీని పై తెలుగుదేశం పార్టీ కూడా అంతే ధీటుగా స్పందిస్తుంది. ప్రభుత్వం 40 మందికి డీఎస్సీ ప్రమోషన్లు ఇస్తూ.. ఒకే సామాజిక వర్గానికి కట్టబెట్టారని వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆరోపించారని టీడీపీ నేత దేవినేని ఉమ మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్‌కు దమ్ము, ధైర్యం ఉంటే.. ఆ 40 మంది పేర్లు, ఏ సామాజిక వర్గానికి చెందినవాళ్లో.. అన్ని వివరాలతో సహా మీడియా ముందు పెట్టాలని జగన్‌కు సవాల్ చేశారు. ఎవరు ఎప్పుడు ప్రమోషన్ ఇచ్చారో మొత్తం మీడియా ముందు పెట్టాలని డిమాండ్ చేశారు.
మీడియాపై నమ్మకం లేకపోతే.. అవినీతి పత్రిక అయిన సాక్షిలో వివరాలు రాయాలన్నారు. దుర్మర్గంగా ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని దేవినేని ఉమ మండిపడ్డారు. నిన్న జగన్ మీడియాతో మాట్లాడుతూ స్పీకర్ కోడెలే చొక్కా చింపుకున్నారని అన్నారని.. చొక్కాలు చింపుకోవడం, క్రిమినల్ వ్యక్తిత్వం వైసీపీ నేతలకే ఉంటుందని దేవినేని ఉమ తీవ్ర స్థాయిల ఆరోపించారు. నిన్న గవర్నర్ దగ్గర జగన్ చెప్పినవన్నీ అబద్దాలేనని అన్నారు. పోలింగ్ రోజే జగన్ ఓటమిని ఒప్పుకున్నారని అన్నారు. బీజేపీ సహకారంతో జగన్ మళ్లీ కుట్రలు చేస్తున్నారన్నారని ఆరోపించారు. సీఎస్, ఎస్పీలను బదిలీ చేస్తే రిటైర్డ్ అధికారులు ఎక్కడున్నారని ప్రశ్నించారు. రిటైర్డ్ అధికారులు ఎందుకు నోరు మెదపలేకపోయారన్నారు.
హైదరాబాద్ కేంద్రంగా కుట్రలు జరుగుతున్నాయని, ఆర్థిక ఉగ్రవాది పక్కన చేరి సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని దేవినేని ఉమ విమర్శించారు. దుర్మార్గాలు చేసే వారికి సహకరిస్తే ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు. ఎన్నికల ఫలితాలు చూసి తట్టుకునేందుకు జగన్ సిద్ధంగా లేరని, ఫైనల్ పేమెంట్ తీసుకున్న ప్రశాంత్ కిషోర్ జగన్ చేతిలో సీఎం అనే నేమ్ ప్లేట్ పెట్టి వెళ్లాడని విమర్శించారు. 11వ తేదీ సాయంత్రమే జగన్ తన ఓటమిని అంగీకరించారని పేర్కొన్నారు. కౌంటింగ్ వరకు క్యాడర్ని కాపాడుకునేందుకు జగన్ అనేక తంటాలు పడుతున్నారని ఉమా అన్నారు. స్పీకర్‌పై దాడి చేసింది కాక గవర్నర్‌కు అన్నీ అబద్ధాలే చెప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చొక్కాలు చించుకునే సంస్కృతి జగన్‌దేనని విమర్శించారు.