ఆంధ్రప్రదేశ్ పోలీసులను టార్గెట్ చేస్తూ, కావాలని వారిని అప్రతిష్ట పాలు చేస్తున్న A2 విజయసాయి రెడ్డి రోజు రోజుకీ పేట్రేగి పోతూ, ఏపి పోలీసులను టార్గెట్ చేస్తున్నారు. నోటికి ఇష్టం వచ్చిన ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో నిన్న మరోసారి, ఇంటెలిజెన్స్ మాజీ డీజీ, ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుని టార్గెట్ చేస్తూ రెచ్చిపోయారు. దీని పై ఏబీ వెంకటేశ్వరరావు సీరియస్ గా స్పందించారు. ఇన్నాళ్ళు ఎన్ని ఆరోపణలు చేస్తున్నా, మౌనంగా భరించిన ఏబీ వెంకటేశ్వరరావు, ఇక ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. తనని అంటూ వచ్చారని, ఇప్పుడు ఏకంగా తన కుటుంబాన్ని కూడా రాజకీయాలకు వాడుకుంటే చూస్తూ ఊరుకునే పని లేదని హెచ్చరికలు జారీ చేసారు.
తనతో పాటు కుటుంబ సభ్యులకు ఎవరితోనూ వ్యాపార సంబంధాలు లేవని ఏబీ వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. ఈ విషయంలో వైకాపా నేత విజయసాయిరెడ్డి తనపై చేస్తున్న నిరాధార, హేయమైన ఆరోపణలను ఖండిస్తున్నట్లు చెప్పారు. ఈ-ప్రగతి ప్రాజెక్టుతో తనకు ఎలాంటి సంబంధాలు లేవన్నారు. ప్రభుత్వ సంస్థలు, ఏజెన్సీలు, సబ్ కాంట్రాక్టులతో ప్రమేయం లేదని చెప్పారు. విజయసాయి రెడ్డి చేసిన ఆరోపణలు అన్నీ అబద్ధమని చెప్పారు. నిరాధార ఆరోపణలు చేసిన విజయసాయిరెడ్డి పై పరువునష్టం దావా వేయబోతున్నట్లు వెంకటేశ్వరరావు వివరించారు. ఇలాంటి హేయమైన ఆరోపణలు చేసినందుకు, ఇక విజయసాయి రెడ్డికి మూడినట్టే.
నిన్న ఎన్నికల సంఘాన్ని కలిసిన తరువాత మీడియా సమావేశంలో మాట్లాడుతూ విజయ సాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కేసుల వరకు వెళ్లాయి. ఆధార్ సంస్థ చేసిన ఫిర్యాదు పై స్పందనగా మాట్లాడిన విజయ సాయిరెడ్డి ఏపిలో ఇప్రగతి ప్రాజెక్టు పేరుతో ఆధార్ సమాచారం మొత్తం సేకరించారని.. ఆ ప్రాజెక్టు కాంట్రాక్టు డిజిపి ఠాకూర్ తో పాటుగా ఇంటలిజెన్స్ చీఫ్‌గా వ్యవహరించిన ఏబి వెంకటేశ్వరరావు సంబంధీకులు దక్కించుకున్నారని చెప్పుకొచ్చిన విజయ సాయిరెడ్డి సరైన సమయంలో వివరాలను బయట పెడతానని చెప్పారు. దీని పై స్పందించిన ఏబి వెంకటేశ్వర రావు తమకు ప్రభుత్వం లో ఎటువంటి కాంట్రాక్టులు..ఒప్పందాలు లేవని స్పష్టం చేసారు. తన పై హేయమైన వ్యాఖ్యలు చేసిన విజయ సాయిరెడ్డి పై పరువు నష్టం దావా వేయనున్నట్లు స్పష్టం చేసారు.