మద్రాసు హైకోర్టులో మంగళవారం పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీకి, కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు ఎదురుదెబ్బ తగిలింది. కేంద్ర పాలిత ప్రాంతమయిన పుదుచ్చేరిలో ఎన్నికయిన ప్రభుత్వం నిర్వహించే రోజువారీ వ్యవహారాలలో లెఫ్టినెంట్ గవర్నర్ జోక్యం చేసుకోజాలరని హైకోర్టు మంగళవారం తీర్పు ఇచ్చింది. హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పు పట్ల పుదుచ్చేరి ముఖ్యమంత్రి వి.నారాయణసామి హర్షం వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్య విజయమని ఆయన అభివర్ణించారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కె.లక్ష్మినారాయణన్ దాఖలు చేసిన ఒక పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి ఆర్.మహదేవన్.. లెఫ్టినెంట్ గవర్నర్ అధికారాలను పెంచుతూ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ 2017 జనవరి, జూన్ నెలల్లో జారీ చేసిన రెండు సర్క్యులర్లను మంగళవారం కొట్టివేశారు.

game 27032019

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ మధ్య పోరుపై సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ, ఢిల్లీ ప్రభుత్వంపై విధించిన ఆంక్షలు పుదుచ్చేరి ప్రభుత్వానికి వర్తించవని న్యాయమూర్తి మహదేవన్ స్పష్టం చేశారు. ‘నేషనల్ క్యాపిటల్ టెరిటరి ఆఫ్ ఢిల్లీ, పుదుచ్చేరి మధ్య వ్యత్యాసం ఉందని అత్యున్నత న్యాయస్థానం స్పష్టంగా చెప్పింది’ అని ఆయన పేర్కొన్నారు. పుదుచ్చేరి.. రాష్ట్రం కాకపోయినప్పటికీ ఒక రాష్ట్ర అసెంబ్లీకి ఉండే అన్ని అధికారాలు పుదుచ్చేరి అసెంబ్లీకి ఉంటాయని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా, కిరణ్ బేడీతో వివిధ అంశాలపై తలపడుతున్న సీఎం నారాయణసామి హైకోర్టు ఇచ్చిన తీర్పు చరిత్రాత్మకమని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య విజయాన్ని ఈ తీర్పు ప్రతిఫలింపచేసిందని అన్నారు.

game 27032019

కాగా, కోర్టు తీర్పును తాము పరిశీలిస్తున్నామని కిరణ్ బేడీ పేర్కొన్నారు. ‘అడ్మినిస్ట్రేటర్ ప్రభుత్వ రోజువారీ వ్యవహారాలలో జోక్యం చేసుకోజాలరు. మంత్రుల మండలి, ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాలకు ప్రభుత్వ కార్యదర్శులు, ఇతర అధికారులు కట్టుబడి ఉండాలి’ అని న్యాయమూర్తి తన ఆదేశాలలో పేర్కొన్నారు. అడ్మినిస్ట్రేటర్ ఆదేశాల మేరకు అధికారులు సమాంతర ప్రభుత్వాన్ని నడపజాలరని పేర్కొన్నారు. ఈ తీర్పు పై చంద్రబాబు కూడా ట్విట్టర్ లో స్పందించారు "Nurturing democracy requires interpretation of provisions of the Constitution in its true spirit. The verdict of Tamil Nadu High Court's Madurai bench clarifies the powers of the elected government in Puducherry. It vindicated our stand that People's aspirations can be fulfilled only through popularly elected governments not appointed representatives."

Advertisements

Advertisements

Latest Articles

Most Read