కేంద్రంతో విభేదించిన త‌రువాత, ఢిల్లీ నుంచి మోడీ కావాలని చేస్తున్న సిబిఐ దాడుల పై, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వం ఓ అసాధార‌ణ నిర్ణ‌యం తీసుకుంది. కేంద్ర ప్ర‌భుత్వం సీబీఐను రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం దుర్వినియోగం చేస్తుంద‌ని ఆరోపించింది. దీంతో..ఏపిలో సీబీఐకి జ‌న‌ర‌ల్ క‌న్సెంట్‌ను ర‌ద్దు చేస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. పోలీసులు..సాధార‌ణ ప‌రిపాల‌న శాఖ అనుమ‌తి తీసుకోకుండా సీబీఐ దాడి చేయ‌టానికి అనుమ‌తి లేద‌ని స్ప‌ష్టం చేస్తూ ఏపి ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. కేవ‌లం రాష్ట్ర ప్ర‌భుత్వం కోర‌టం..లేదా కోర్టు ఆదేశాల మేర‌కు మాత్ర‌మే సీబీఐ ఏపిలో దాడులు..సోదాలు నిర్వ‌హించాల్సి ఉంటుంద‌ని ప్ర‌భుత్వం జారీ చేసిన ఉత్త‌ర్వుల్లో స్ప‌ష్టంగా పేర్కొంది. దీని పైన రాజ‌కీయంగా అనేక విమ‌ర్శ‌లు వచ్చినా ఏపి ప్ర‌భుత్వం మాత్రం త‌మ వాద‌న‌కే క‌ట్టుబ‌డి ఉంది.

game 27032019

అయితే తాజగా, సీబీఐ వ‌ర్సెస్ ఏపి ప్ర‌భుత్వం అన్న‌ట్లుగా మారిన వ్య‌వ‌హారం ఇప్పుడు రాజీ మార్గంలో స‌మిసిపోయింది. ఏపిలో సీబీఐ అధికారిని ట్రాప్ చేసి సీబీఐ ప‌ట్టుకుంది. అయితే, గ‌తంలో తాము తీసుకున్న నిర్ణ‌యం మేర‌కు న‌డుచుకోవాల్సిందేన‌ని స్ప‌ష్టం చేసింది. దీంతో..తాము న‌మోదు చేసిన కేసును ఏసీబీకి అప్ప‌గించింది. ఆదాయపన్ను మదింపు విషయంలో వ్యాపారి నుంచి లంచం తీసుకుంటూ సీబీఐకి పట్టుబడిన గుంటూరు జిల్లా తెనాలి-1 ఐటీ అధికారి అవుతు చంద్రశేఖర్‌రెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఆయన్ని విజయవాడ కోర్టులో హాజరుపరిచారు. అరెస్టు సందర్భంగా తెనాలిలోని ఐటీ కార్యాలయంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్న విషయం విదితమే. తొలుత సీబీఐ అధికారులు చంద్రశేఖరరెడ్డిని రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

game 27032019

అయితే ఏపీలో మారిన నిబంధనల నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల అవినీతిపై ఏసీబీకే దాడులు చేసే అధికారం ఉంది. ఈ నేపథ్యంలో చంద్రశేఖరరెడ్డిని అరెస్టు చేస్తే సాంకేతిక సమస్యలు ఉత్పన్నమవుతాయని భావించిన సీబీఐ ఆయన్ని ఏసీబీకి అప్పగించారు. ఈ మేరకు గుంటూరులో ఏసీబీ అదనపు ఎస్పీ మంగళవారం కేసు నమోదు చేశారు. ఆపై ఏసీబీ డీఎస్పీ గంగాధరం నిందితుడిని విజయవాడలోని ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. విజయవాడ ఎల్‌ఐసీ కాలనీలోని ఐటీ అధికారి ఇంట్లో సోదాలు కూడా నిర్వహించారు. పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఆ సమయంలో చంద్రశేఖర్‌రెడ్డి సీబీఐ అధికారులపై తిరగబడి కత్తెరతో పొడుచుకున్నారు. ఆ త‌రువాత ఏపి అధికారులు సీబీఐ అధికారుల దృష్టికి గ‌తంలో తాము తీసుకున్న నిర్ణ‌యం.. జారీ చేసిన ఉత్త‌ర్వులు సంగ‌తి పైన చ‌ర్చించారు. దీని పైన కొంత ప్ర‌తిష్ఠంబ‌న ఏర్ప‌డింది. ఉన్న‌తాధికారుల జోక్యంతో సీబీఐ అధికారులు స్థానికంగా ఉన్న నిబంధ‌న‌ల మేర‌కు లోక‌స్ ఏసీబీ అధికారుల‌కు కేసును బ‌దిలీ చేసారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read