'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై ముఖ్యమంత్రి చంద్రబాబు పరోక్షంగా విమర్శలు గుప్పించారు. 'ఒకాయన ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టారంట. ఎందుకు పెట్టారో నాకు తెలియదు. రోడ్డు మీద కాకపోతే, ఎన్నికల సంఘం కార్యాలయంలో పెట్టుకోమనండి. నాకేం సంబంధం. ఇదేమైనా కొత్త సినిమానా? తెలంగాణలో రిలీజ్ చేశారు కదా. ఇక్కడ నామీద ఏంటి? ఆవిడ (లక్ష్మీపార్వతి) ఇప్పుడు ఎక్కడుంది? ఎందుకు ఇలాంటి చిల్లర రాజకీయాలు అంటా. ఎవరికైనా ఒక హుందాతనం, డిగ్నిటీ ఉండాలి' అని వ్యాఖ్యానించారు. అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ... మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు బదులుగా ఆయన ఈ సమాధానం ఇచ్చారు.

game 27032019

తన పోరాటమంతా ప్రధాని మోదీపైనే అని చంద్రబాబు అన్నారు. రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులు ఇచ్చి ఉంటే... ఆయనను నిలదీయాల్సిన అవసరం తనకు లేదని చెప్పారు. ఇక్కడ పెద్దపెద్ద మాటలు మాట్లాడేవారెవరైనా ఢిల్లీకి వెళ్లి మాట్లాడుతున్నారా? అని ప్రశ్నించారు. గుజరాత్, తెలంగాణల కంటే ఏపీలోనే అభివృద్ధి ఎక్కువగా ఉందని అన్నారు. ఎన్నిక‌ల సంఘం నియ‌మించిన సీఎస్ అతిగా స్పందిస్తున్నార‌ని ముఖ్య‌మంత్రి వ్యాఖ్యానించారు. తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం బంగారం ర‌వాణా విష‌యంలో అతిగా స్పందించి విచార‌ణ‌కు ఆదేశించార‌ని..అందులో అస‌లు త‌ప్పు ఏం జ‌రిగింద‌ని ప్ర‌శ్నించారు.

game 27032019

అదే విధంగా ఫైబ‌ర్ గ్రిడ్ నష్టాల్లో ఉంటే మూసేస్తామ‌ని హెచ్చ‌రిస్తున్నార‌ని..అలాగైతే ప్ర‌భుత్వాన్ని మూసేస్తారా అని నిల‌దీసారు. త‌న టీంలో ఉన్న అధికారుల‌కు ర‌క్ష‌ణ‌గా తాము ఉంటామ‌ని చెప్పుకొచ్చారు. ఎన్నిక‌ల సంఘం అదేశాల‌ను అధికారులు పాటించ‌టంలో త‌ప్పు లేద‌ని..అయితే ఎన్నిక‌ల సంఘం సైతం ప్ర‌జ‌లు ఇబ్బంది ప‌డే విధంగా వ్య‌వ‌హ‌రించ‌కూడ‌ద‌ని పేర్కొన్నారు. ప్ర‌ధాని మోదీ పైన చంద్ర‌బాబు తీవ్ర వ్యాఖ్య‌లు చేసారు. ఈ నెల 23న ఫలితం ఎలా ఉండబోతోందో ఇప్పుడే అర్థమైనట్లు ఉందని వ్యాఖ్యానించారు. అందుకే విపక్షాల ఉనికిని కూడా మోదీ సహించలేకపోతున్నార‌న్నారు. ప్రతిపక్షాలను చూసి ఓర్వలేకపోతున్నారని ఎద్దేవా చేసారు. ప్రతిపక్షాలు కొత్త దుస్తులు కొనుక్కుంటున్నారని మాట్లాడుతున్నారని.. ఏదీ తోచక అలా మాట్లాడుతున్నారని విమ‌ర్శించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read