ప్రభుత్వాలు ఎంత బాగా పని చేసినా, ప్రభుత్వం తరుపున ఎంత వ్యక్తిగత లబ్ది ప్రజలకు ఇచ్చినా, ఎన్నికల ముందు రోజు, ఇంటికి వచ్చి డబ్బులు ఇచ్చిన వాడే కింగ్ అనే విషయం అందరికీ తెలిసిందే. రాజకీయాలు అలా మారిపోయాయి. ప్రజలు అలా మార్చేసారు అనటం కరెక్ట్ ఏమో. తెలుగుదేశం నేతల కంటే, వైసీపీ నేతలు డబ్బులు ఎక్కువ ఇచ్చిన చోట్ల, పరిస్థితి ఏంటి అన్నది అంతు పట్టటం లేదు. ఇలాంటి స్థానాలు రాష్ట్రంలో సుమారు 20 వరకు ఉన్నట్లు సమాచారం. ఆ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు ఎన్నికల వ్యూహంలో ప్రత్యర్థి కంటే వెనుకంజలో ఉన్నట్లు తెలిసింది. కొందరికి ఆర్థిక ఇబ్బందులు, మరికొందరిలో ధీమా దీనికి కారణంగా తెలుస్తోంది. పసుపు-కుంకుమ పథకం కింద మహిళలకు ప్రభుత్వం తరఫున ఇచ్చిన రూ.10 వేలు తమకు సానుకూల ఓటును తెస్తుందన్న విశ్వాసం తెలుగుదేశం అభ్యర్థుల్లో బలంగా ఉంది.

game 27032019

మహిళా ఓటుబ్యాంకు తమకేనన్న వాతావరణమూ కనిపించింది. దీంతో కొందరు అభ్యర్థులు ఎన్నికలను కాస్త తేలిగ్గా తీసుకున్నారని అంటున్నారు. మరికొన్ని చోట్ల మాత్రం ఆర్థిక ఇబ్బందులతో వైసీపీతో సమంగా ఎన్నికల ఖర్చు చేయలేకపోయామని అభ్యర్థులే చెబుతున్నారు. అయితే ఇప్పుడు ఇలాంటి స్థానాల్లో ఫలితం ఏమవుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో నెలరోజుల ముందే వైసీపీ నేతలకు అందాల్సిన సంచులు అందిపోయాయి. ఆ పార్టీ అభ్యర్థులు కూడా ఎన్నికల ఖర్చుకు అనుగుణంగా సిద్ధమైపోయారు. కోస్తా, ఉత్తరాంధ్రల్లోనూ వారం-పదిరోజుల ముందే వైసీపీ నేతలు అన్ని సన్నాహాలూ చేసుకున్నారు. పంపకాలు కూడా నాలుగు రోజుల ముందే చేసేశారు.

game 27032019

తెలుగుదేశం అభ్యర్థులు పలుచోట్ల చివరి నిమిషంలో పాట్లు పడాల్సి వచ్చింది. కొన్నిచోట్ల ప్రభుత్వ పథకాల మంచిపేరు తమను గెలిపిస్తుందన్న ధీమాతో ఖర్చును నియంత్రించుకున్నారు. విశాఖపట్నం జిల్లా భీమిలి, నెల్లూరు జిల్లాలో సూళ్లూరుపేట, కృష్ణా జిల్లాలో తిరువూరు, మచిలీపట్నం, ప్రకాశం జిల్లా ఒంగోలు.. ఇలా పలు స్థానాల్లో వైసీపీ కంటే ఆర్థికపరంగా తెలుగుదేశం పార్టీ వెనకబడిందని అంటున్నారు. ఎన్నికలు ఎన్నికలే.. పథకాలు పథకాలే అన్నట్లుగా అభ్యర్థులు వ్యవహరించాల్సిందని, కానీ ఇలా అరకొరగా ఎన్నికల వ్యూహం చేయడం వల్ల ఏమవుతుందోనన్న ఆందోళనను పార్టీ నేతలే కొందరు వ్యక్తం చేస్తున్నారు. అయితే మెజారిటీ నేతలు మాత్రం.. వైసీపీ నేతలు ఎంత డబ్బు వెదజల్లినా, ప్రలోభాలకు గురిచేసినా తమదే విజయమని ధీమాగా చెబుతున్నారు ఇప్పుడు ఆర్థికపరంగా ఇబ్బందిపడ్డ స్థానాల్లో పలు చోట్ల పార్టీకి 5-10వేల మెజారిటీ వచ్చే అవకాశాలు ఉన్నవే. వైసీపీ నేతల ఆర్థిక ప్రలోభాలు ప్రభావం చూపినా.. ఆయా స్థానాల్లో ఎక్కువ చోట్ల మెజారిటీ తగ్గుతుంది తప్ప విజయం ఖాయం అని ధీమా కనబరుస్తున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read