‘పసుపు-కుంకుమ’ కింద మహిళలకు పదివేల రూపాయలు చంద్రబాబు ఇచ్చారన్న ఫీలింగ్ వారిలో ఉంటే వాళ్లే కాదు వాళ్ల కుటుంబసభ్యులు కూడా టీడీపీకే ఓటు వేస్తారని ప్రముఖ రాజకీయవేత్త ఉండవల్లి అరుణ్ కుమార్ అభిప్రాయపడ్డారు. ‘టీవీ9’ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘పసుపు-కుంకుమ’ ప్రభావం పని చేసిందా?లేదా? అనే ప్రశ్నకు తాను సమాధానం చెప్పలేనని, అది తన స్థాయి కాదని చెప్పారు. 2014 నుంచి ఇప్పటి వరకూ చూస్తే జగన్ లో ఇంప్రూవ్ మెంటే ఉంది తప్ప, ‘డౌన్’ అయ్యేందుకు అవకాశాలు లేవని అభిప్రాయపడ్డారు. చంద్రబాబు విషయానికొస్తే, గతంలో టీడీపీకి మద్దతుగా ఉన్న బీజేపీ, జనసేన పార్టీలు ఈసారి లేవని, ఈ లెక్క ప్రకారం చూసుకుంటే జగన్ పైచేయిలో ఉన్నాడని, చంద్రబాబు కింద ఉన్నారన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.

game 27032019

వీటన్నింటినీ మించి దేశంలో ఎక్కడా లేనట్టుగా ‘పసుపు-కుంకుమ’ కింద పది వేల రూపాయలు ఖాతాలో వేసి, మళ్లీ తామే అధికారంలోకొస్తే అదే మొత్తం వేస్తూనే ఉంటానని మహిళలకు చంద్రబాబు ఇచ్చిన హామీ వారిపై కచ్చితంగా పనిచేస్తుందని అనుకుంటున్నానని ఉండవల్లి అన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఫలితాలపై ఓ అంచనాకు వచ్చేలా చేస్తున్నాయి. ఆయనేమన్నారంటే.. ‘‘2014లో జగన్‌కు ఇప్పటి జగన్‌కు తేడా ఏం లేదు. అయితే ఇంప్రూవ్‌మెంట్ ఉంది. రాష్ట్రంలో యువత ఎక్కువగా జగన్‌ వైపే ఉన్నారు."

game 27032019

"వీటన్నింటికీ మించి.. ఈ సారి జరిగిన ఎన్నికలను ఎక్కడా చూడలేదు. దేశంలో ఎక్కడా లేనివిధంగా మహిళలు ఒక్కొక్కరికీ అకౌంట్లో పదివేలు రూపాయలు వేయడం.. అంతేగాక ఏటా వేస్తానని బాబు చెప్పడం.. టీడీపీకి కలిసి వస్తుంది. ఇది కేవలం పసుపు కుంకుమ మాత్రమేనని.. మిగిలిన వాటితో సంబంధం లేదని బాబు చెప్పడం గమనర్హం. డెఫినెట్‌గా పదివేలు పని చేయాలనే నేను అనుకుంటున్నాను. పని చేసి ఉంటుందనే భావిస్తున్నా. తమకు ఉదారంగా ఇచ్చాడు.. సహాయం చేశాడు అనుకుంటే.. చంద్రబాబుకే మహిళలు, వారి కుటుంబ సభ్యులు ఓటేస్తారు’’ అంటూ ఫలితాలపై తన మనసులో మాట చెప్పారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read