భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్‌పై సుప్రీంకోర్టు మాజీ మహిళా ఉద్యోగి ఒకరు సంచలన ఆరోపణలు చేశారు. గతేడాది అక్టోబర్ 10, 11 తేదీల్లో ఆయన తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆమె పేర్కొన్నారు. ఈ మేరకు సుప్రీంకోర్టులోని 22 మంది న్యాయమూర్తులకు ఆమె ఫిర్యాదు చేశారు. ‘‘ఆయన నా నడుము పట్టుకుని కౌగిలించుకున్నారు. హత్తుకుంటూ శరీరమంతా తన చేతులతో తడిమారు. బయటికి వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. నిశ్చేష్టురాలైన నేను ఆయన నిర్బంధాన్ని వదిలించుకునేందుకు ఎంత గట్టిగా ప్రయత్నించినా ఆయన నన్ను వదల్లేదు. అంతటితో ఆగకుండా నన్ను ‘హత్తుకో’ అని అన్నారు...’’ అంటూ 35 ఏళ్ల సదరు ఉద్యోగిని తన లేఖలో పేర్కొన్నారు.

cji 20042019

సుప్రీం కోర్టు మాజీ మహిళా ఉద్యోగి ఒకరు తనపై చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలను భారత ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ తీవ్రంగా ఖండించారు. న్యాయవ్యవస్థ స్వేచ్ఛ ప్రమాదంలో పడిందనీ... అయితే అది ఎప్పటికీ బలిపశువుగా మారబోదని ఘాటుగా స్పందించారు. మాజీ మహిళా ఉద్యోగి సుప్రీం న్యాయమూర్తులకు ఫిర్యాదు చెయ్యటంతో, దీనిపై సుప్రీంకోర్టు ప్రత్యేక ధర్మాసనం ఇవాళ అత్యవసర విచారణ చేపట్టింది. ముగ్గురు సభ్యులు గల ఈ బెంచ్‌లో జస్టిస్ గొగోయ్‌తో పాటు జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ సంజీవ్ ఖన్నా ఉన్నారు. విచారణ సందర్భంగా జస్టిస్ గొగోయ్ మాట్లాడుతూ... ‘‘ఇది నమ్మశక్యంగా లేదు. ఈ ఆరోపణలను ఖండించడానికి నన్ను నేను ఇంత తగ్గించుకోవాల్సి వస్తుందని ఊహించలేదు..’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారం వెనుక పెద్ద కుట్రే దాగి ఉందన్నారు. ‘‘దీని వెనుక పెద్ద శక్తులే ఉన్నాయి. ప్రధాన న్యాయమూర్తి కార్యాలయాన్ని స్తంభింపచేయాని వారు చూస్తున్నారు...’’ అని ఆయన పేర్కొన్నారు. తాను దీనిపై ఎలాంటి తీర్పులూ వెలువరించబోననీ.. సీనియర్ న్యాయమూర్తి అరుణ్ మిశ్రా తీర్పు చెబుతారని ఆయన పేర్కొన్నారు.

cji 20042019

వచ్చేవారం సుప్రీంకోర్టులో తాను పలు కీలక కేసులు విచారించబోతున్నాననీ... అందుకే తనపై ఈ రకమైన ఆరోపణలు చేయిస్తున్నారని జస్టిస్ గొగోయ్ అన్నారు. ‘‘నేను ఇదే స్థానంలో కూర్చుంటాను. నిర్భయంగా నా విధులు నిర్వహిస్తాను. విషయాలు చాలా దూరం వెళ్లాయి. అయినప్పటికీ న్యాయ వ్యవస్థ ఎన్నటికీ బలిపశువుగా మారబోదు..’’ అని ఆయన స్పష్టం చేశారు. తనపై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకపోవడంతో... ఏమీ దొరక్క, చివరికి ఇదొకటి పట్టుకుని వచ్చారన్నారు. ‘‘న్యాయమూర్తిగా 20 ఏళ్లు నిస్వార్థంగా పనిచేసిన నాకు బ్యాంకు ఖాతాలో రూ.6.80 లక్షలు ఉన్నాయి. దీనికంటే నా బంట్రోతు డబ్బులే ఎక్కువగా ఉంటాయి. 20 ఏళ్ల తర్వాత ఓ ప్రధాన న్యాయమూర్తికి ఇచ్చే బహుమతి ఇదేనా?’’అని జస్టిస్ రంజన్ గొగోయ్ ప్రశ్నించారు. ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్‌పై ఆరోపణలు చేసిన మహిళకు క్రిమినల్ నేపథ్యం ఉందనీ, ఆమెపై రెండు పోలీసు కేసులు కూడా ఉన్నాయని సుప్రీం సొలిసిటర్ జనరల్ తుషార్ మెహ్రా పేర్కొన్నారు. జస్టిస్ గొగోయ్‌ని బ్లాక్ మెయిల్ చేసేందుకే ఆమె ఈ ఆరోపణలు చేసినట్టు కనిపిస్తోందని సోలిసిటర్ జనరల్ తుషార్ మెహ్రా అభిప్రాయపడ్డారు.

 

Advertisements

Advertisements

Latest Articles

Most Read