ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు సమీక్షలు చేయడంపై ఎన్నికల సంఘం అభ్యంతరం తెలిపిన సంగతి తెలిసిందే. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందును సమీక్షలు చేయడానికి వీల్లేదని ఈసీ చెబుతోంది. ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకోవడంతో వైసీపీ-టీడీపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా వైసీపీ చేసిన విమర్శలకు మంత్రి నారా లోకేష్ ట్విట్టర్‌లో కౌంటరిచ్చారు. రాష్ట్రానికో రూల్ ఉందా అంటూ ఘాటుగా ట్వీటారు. ‘ఎన్నికల కోడ్ ఒక్క ఏపీలోనే ఉందా? ఈసీ ఆంక్షలన్నీ ఒక్క టీడీపీకే వర్తిస్తాయా?ఎండలు, తాగునీటి సమస్యలపై కూడా ముఖ్యమంత్రి సమీక్షలు జరిపి చర్యలు తీసుకోకపొతే ప్రజల పరిస్థితి ఏమిటి? ఆలోచించరా? కోడి గుడ్డు మీద ఈకలు పీకే మీ బుద్ధి మారదా?’అన్నారు . ‘తెలంగాణ ముఖ్యమంత్రి జరిపే సమీక్షల్లో ప్రధాన కార్యదర్శితో సహా డీజీపీ కూడా పాల్గొంటున్నారు. కెసిఆర్ సమీక్షలపై సమాచార పౌర సంబంధాల శాఖ అధికారికంగా పత్రికా ప్రకటనలు కూడా చేస్తోంది. అక్కడ కోడ్ వర్తించదా? ఏంటీ పక్షపాతం?’అని ప్రశ్నించారు.

lokesh 20042019

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గురువారం సచివాలయంలో నిర్వహించిన సీఆర్డీయే పనుల పురోగతిపై నిర్వహించిన సమీక్షతో సరికొత్త వివాదం తెరమీదికి వచ్చింది. ముఖ్యమంత్రి ఏకపక్షంగా వ్యవహరిస్తూ, రాష్ట్రంలోని ఎన్నికల నిబంధనలను తూట్లు పొడుస్తున్నారని ప్రతిపక్షపార్టీ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌, బీజేపీ నేతలు గగ్గోలు పెడుతున్న సంగతి తెలిసిందే. గురువారం సీఎం సీఆర్డీయే సమీక్ష నిర్వహించిన అనంతరం మధ్యాహ్నం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ నేతలు వెలగపూడిలోని అమరావతి సచివాలయంలో 5వ బ్లాక్‌లో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి లిఖిత పూర్వకమై ఫిర్యాదును అందజేశారు. అప్పటికే రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యాలయ ఉన్నతాధికారులకు నోటీసులను ప్రత్యేక దూతతో పంపారు.

lokesh 20042019

సీఈఓ కార్యాలయం నుండి నోటీసు అందిందన్న విషయం తెలిసిన వెంటనే చంద్రబాబు అమరావతి నిర్మాణ పనుల పురోగతి, రాష్ట్రంలోని శాంతిభద్రతలపై హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం, డీజీపీ ఆర్పీ ఠాకూర్‌, హోంశాఖ ముఖ్యకార్యదర్శి ఏ.ఆర్‌.అనూరాధ, ఇతర ఉన్నతాధికారులతో కలిసి సమీక్ష నిర్వహించాలని భావించి, ఆపైన రద్దు చేసుకున్నారు. శాంతిభద్రతలపై సమీక్షకు సంబంధించి సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌చంద్రతో చర్చించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నందున ముఖ్యమంత్రి నిర్వహించే సమీక్షా సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదాలో తాను హాజరు కాకూడదని, ఇది కోడ్‌కు వ్యతిరేకమని స్పష్టం చేయడంతోపాటు, సీఎంతో హోంశాఖ ముఖ్యకార్యదర్శి అనూరాధ విడిగా భేటి అయ్యి, శాంతిభద్రతలకు సంబంధించిన ముఖ్యమంత్రి సూచనలు తనకు తెలియజేయాలని ఆదేశించారు. దీంతో సీఎం చంద్రబాబు కూడా వెనక్కి తగ్గనట్లు సీఎం కార్యాలయ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read