రీపోలింగ్ జరు గుతున్న పెద్దారవీడు మండలం కలనూ తలలో ప్రచారం సందర్భంగా సోమవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అనుమతి లేని ఇరు పార్టీలకు చెందిన రెండు వాహనాలను అధికారులు సీజ్ చేశారు. వారికి నోటీసులు ఇచ్చారు. మరోవైపు గ్రామంలో ప్రచారం చేస్తున్న వైసీపీ అభ్యర్థి ఆదిమూలపు సురేష్‌కు, ఎస్సై ప్రభాకరరావుకు మధ్య తీవ్రస్థాయిలో వాగ్వివాదం జరిగింది. ఈ సందర్భంగా సురేష్ ఆవేశంగా మాట్లాడారు. ‘వచ్చేది మా ప్రభుత్వమే. ఆ తర్వాత మీ సంగతి చూస్తాం’ అంటూ హెచ్చరించారు. మార్కాపురం సీఐ వై. శ్రీధర్‌రెడ్డి జోక్యం చేసుకోవడంతో వివాదం సద్దుమణిగింది.
పెద్దారవీడు మండలం కలనూతలలో సోమవారం రీ పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం వైసీపీ అభ్యర్ధి ఆదిమూలపు సురేష్, టీడీపీ ఎంపీ అభ్యర్ధి శిద్దా రాఘవరావు, ఎమ్మెల్యే అభ్యర్థి అజితారావు గ్రామంలో ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. ఇరు పార్టీల నాయకులు ప్రచార రథాలపై గ్రా మంలో తిరిగారు. అయితే ఎన్నికల నిబంధనల ప్రకారం ప్రచారానికి వినియోగించే వాహనాలకు ముందుగా ఎన్నికల అధికారుల ద్వారా అనుమతులు తీసుకోవాల్సి ఉంది. కానీ ఇరు పార్టీల నాయకులు దాన్ని పాటించలేదు. దీంతో టీడీపీ, వైసీపీలకు చెందిన రెండు వాహనాలను సీజ్ చేసినట్లు ఆర్డీవో జి. రామకృష్ణారెడ్డి తెలిపారు. మరోవైపు ఇరు పార్టీల నాయకులు ఒకేసారి గ్రామంలో ప్రచారానికి దిగడంతో అక్కడ పరిస్థితిని చక్కదిద్దేందుకు పోలీసులు ఇబ్బంది పడ్డారు.
ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి అను మతి లేని వాహనాలపై ప్రచారం నిర్వహిం చిన టీడీపీ అభ్యర్థి బూదాల అజితారావు, వైసీపీ అభ్యర్థి ఆదిమూలపు సురేష్‌కు ఎర్ర గొండపాలెం ఎన్నికల రిటర్నింగ్ అధికారి శ్రీని వాసులు నోటీసులు ఇచ్చారు. కోడ్‌ను ఉల్లం ఘించినందుకు వివరణ ఇవ్వాలని ఆ నోటీ సుల్లో పేర్కొన్నారు. వారు ఇచ్చే వివరణను బట్టి తదుపరి చర్యలు తీసుకుంటామని ఆయ న తెలిపారు. సీజ్‌చేసిన వాహనాలను డీఎస్పీకి స్వాధీనం చేసినట్లు చెప్పారు.