తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌తో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన తెదేపా ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు భేటీ కావడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు పార్టీ మారుతారంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల రామచంద్రాపురంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కూడా..పార్టీ మారే అంశంపై త్రిమూర్తులు స్పష్టత ఇవ్వలేదు. కార్యకర్తల అభీష్టం మేరకే నిర్ణయం తీసుకుంటానని పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తెదేపాను వీడి వైకాపాలో చేరే ముందు త్రిమూర్తులుతో భేటీ అయ్యారు. తాజాగా మంత్రి తలసానితో హైదరాబాద్‌లో త్రిమూర్తులు భేటీ కావడం రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది.
తలసాని మాట్లాడుతూ ‘‘ఏపీలో నా పర్యటన కొనసాగుతాయి. నేను పర్యటిస్తుంటే చంద్రబాబుకు భయమెందుకు. నాకు అక్కడ బంధువులు, స్నేహితులు, ఆత్మీయులు ఉన్నారు. నా నియోజకవర్గంలో ప్రచారం చేసి నన్ను ఓడించేందుకు కుట్రలు చేసిన చంద్రబాబుపై కచ్చితంగా ప్రతీకారం ఉంటుంది. హైదరాబాద్‌లో ఆస్తులున్న టీడీపీ నేతలను బెదిరించి వైసీపీలో చేర్పిస్తున్నారని టీడీపీ చేస్తున్న ఆరోపణలు అర్థరహితం.’’ అని అన్నారు. మరో పక్క, ఒక హాట్ న్యూస్, హల్ చల్ చేస్తుంది. తెలంగాణ లో స్థిరపడ్డ ఆంధ్ర కి చెందిన పారిశ్రామిక వేత్తలను టార్గెట్ గా తెరాస పావులు కదుపుతుంది. అత్యధిక పారిశ్రామిక వేతలు తెలుగు దేశం సింపటైజర్స్ అవ్వగా వారి అందరిపై ఈడీ, ఇన్కమ్ టాక్స్ ఉపయోగించటానికి రంగం సిద్ధం చేసిన తెరాస అధినేత కెసిఆర్.
ఈ కోవ లో తెలుగు దేశం వైపు ఉన్న పారిశ్రామిక వేతలని భయభ్రఅంతులకి గురిచేసి వారిని వైస్సార్సీపీ కి సపోర్ట్ చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో జగన్ మోహన్ రెడ్డి గెలుపే ద్యేయంగా కుట్ర రాజకీయాలకి తేర తీస్తున్నారు. ఈ నెల 27,28 తారీకులలో భారీ ఎత్తున ఐటీశాఖ ఆంధ్ర పారిశ్రామిక వేతలపై దాడులు చేయబోతున్నట్టు సమాచారం. తెలుగు దేశం లో ఉన్న క్రియాశీలక నేతలని కూడా హైదరాబాద్ లో ఉన్న వాళ్ళ ఆస్తుల మీద దాడి చేసి తద్వారా పార్టీ ని వీడేలా ప్రణాళికలు తెరాస అధినేత రూపొందిస్తున్నారు. హెరిటేజ్ సంస్థల కార్యకలాపాల్ని తెలంగాణ లో ఆపి వేయటానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారని సమాచారం.