వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డితో టాలీవుడ్ ప్రముఖ హీరో అక్కినేని నాగార్జున భేటీ అయిన సంగతి తెలిసిందే. మంగళవారం మధ్యాహ్నం లోటస్‌పాండ్‌కు వెళ్లిన నాగార్జున.. సుమారు అరగంటకు పైగా జగన్‌తో భేటీ అయి పలు విషయాలపై చర్చించారు. త్వరలో ఎన్నికలున్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. మరీ ముఖ్యంగా వైసీపీ తరఫున గుంటూరు ఎంపీగా నాగార్జున పోటీ చేస్తారని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. అయితే భేటీ అనంతరం నాగ్ మీడియాతో మాట్లాడుకుండానే వెళ్లిపోయారు. ప్రస్తుతం జగన్-నాగ్ భేటీ అటు ఏపీ రాజకీయాల్లో.. ఇటు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది.
అయితే ఈ భేటీపై.. ఫస్ట్ టైం నాగార్జున పెదవి విప్పారు. వైఎస్ జగన్ మా కుటుంబ సన్నిహితుడని.. మర్యాద పూర్వకంగానే కలిశానని ఆయన స్పష్టం చేశారు. తనకు రాజకీయాలపై ఆసక్తి లేదని నాగ్ మరోసారి స్పష్టం చేశారు. వైఎస్ జగన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజా సంకల్ప యాత్ర’ను విజయవంతంగా చేసినందుకు కృతజ్ఞతలు తెలిపినట్లు నాగార్జున చెప్పారు. తాను ఎవరికో టికెట్ ఇప్పించాలని జగన్‌ను కలిశానని వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలేనని ఆయన కొట్టి పారేశారు. ఎవరికో టికెట్ ఇవ్వాలని సంప్రదించాల్సిన అవసరం తనకు లేదని నాగార్జున చెప్పుకొచ్చారు. మొత్తానికి చూస్తే భేటీ అనంతరం వచ్చిన పుకార్లకు నాగ్ ఫుల్‌స్టాప్ పెట్టేశారని చెప్పుకోవచ్చు.
అయితే అంతకు ముందు, మీడియా ఈ విషయం పై గల్లాను ప్రశ్నించింది. " నాగార్జున నాకు మంచి స్నేహితుడు. ఆయన రాజకీయాల్లోకి వస్తున్నట్లు నాతో అనలేదు. జగన్‌ను ఎందుకు కలిశారో కూడా నాకు తెలియదు. ప్రత్యర్థులు ఎవరైనా పోటీ ఎప్పుడూ ఉంటుంది. అమ్మ పోటీ చేసిన 4 ఎన్నికలు చూశాను.. కానీ ఈసారి జరగబోతున్న ఎన్నికలు పూర్తిగా భిన్నం. ఏపీ ప్రభుత్వంపై నెగటివ్ ఓటు లేదు.. పూర్తి పాజిటివ్ ఓటు ఉంది. అభ్యర్థుల ఎంపికలో సీఎందే తుది నిర్ణయం" అని గల్లా జయదేవ్ చెప్పుకొచ్చారు. మొత్తానికి చూస్తే ప్రత్యర్థులు ఎవరైనా సరే తాను మాత్రం పోటీ చేసి తీరుతానని గల్లా పరోక్షంగా వ్యాఖ్యానించారు. మరో పక్క, ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్ మామ, ‘నార్నె’ సంస్థల అధినేత నార్నె శ్రీనివాసరావు ఇటీవలే వైసీపీ అధినేత జగన్ ని మర్యాదపూర్వకంగా కలిసిన విషయం తెలిసిందే. వైసీపీలో ఆయన చేరతారని, గుంటూరు నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం జరిగింది. ఈ విషయమై టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ని మీడియా ప్రశ్నించగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడారు. ‘వైసీపీ తరపున మీపై నార్నె శ్రీనివాసరావు పోటీ చేస్తారని చెబుతున్నారని..’ అని అడగగా, ‘ఎవరినైనా రానీయండి. నేను మొదటిసారిగా ఇక్కడి నుంచి పోటీ చేసింది, ‘విన్నింగ్ సీటు, విన్నింగ్ ప్లేస్’ అని రాలేదు. గుంటూరు అంటే మా మామగారి ఊరు... కాబట్టి ఇక్కడికి వచ్చాను ఎన్నికలు ఎక్కడైనా కష్టంగానే ఉంటాయి. ముందు నుంచి కష్టపడితేనే గెలుపు వస్తుంది’అని జయదేవ్ చెప్పుకొచ్చారు.