వచ్చే ఎన్నికల కోసం, ఇప్పటి నుంచే జగన్ బ్యాచ్ విచ్చలవిడిగా సిద్ధమవుతుంది. ఒక పక్క కేంద్రం సపోర్ట్, మరో పక్క, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి సపోర్ట్ తో, దేనికైనా తెగించేందుకు రెడీ అవుతుంది. అయితే, దొంగే దొంగ దొంగ అన్నట్టు, ముందుగా ఫోకస్ అంతా చంద్రబాబు పై తేవటానికి, చంద్రబాబు అయుదు వేలు పంచుతాడు, చంద్రబాబు ఓట్లు తొలగిస్తున్నాడు, ఒక సామాజికవర్గం వారిని తప్పించాలి అంటూ, ఎదురుదాడి చేస్తున్నారు. అయితే జగన్ మాత్రం తాను చెయ్యల్సింది, తాను చేస్తున్నాడు. మొన్నటికి మొన్న, కృష్ణా జిల్లాలో పోలీసులకు డబ్బులు కవర్లు పంపిస్తూ దొరికిపోయిన జగన్ బ్యాచ్, ఇప్పుడు ప్రజలను ప్రలోభాలు పెట్టే పనులు, ఇప్పటి నుంచే మొదలు పెట్టింది.
కృష్ణాజిల్లా ముఖ్య కేంద్రం మచిలీపట్నంలోని ఓ ప్రముఖ స్వీట్ షాపులో వైసీపీస్టిక్కర్స్ తో ప్యాకింగ్ చేసిన స్వీట్ బాక్స్ లను స్వాధీనం చేసుకున్న పోలీసులు 'తొలి ఎన్నికల కోడ్ ఉల్లంఘన' కింద కేసు నమోదు చేసారు. ఓటర్లను ప్రలోభానికి గురి చేసేందుకు పార్టీ సింబల్ తో పెద్ద ఎత్తున స్వీట్ ప్యాకెట్లు ప్యాక్ చేసి స్వీట్ బాక్స్లపై "వైసీపీకి ఓటేద్గాం.. రూ.3వేలు పెన్షన్ తీసుకుందాం" అన్న నినాదాలతో రేపు 1వ తేదీ 'పెన్షన్' ల పంపిణీ జరగనున్ననేపథ్యంలో వైసీపీ సానుభూతి వార్డుల్లో స్వీట్ బాక్స్లను పెన్షన్ దారులకు పంపిణీ చేసేందుకు స్వీట్ బాక్స్లను సిద్దం చేసారు. ఇది వీళ్ళ నీచరాజకీయాలకు ఒక కొలమానం
మార్చి 1 నుంచి సామాజిక పింఛన్ల పంపిణీ సందర్భంగా పింఛన్ దారులకు ఇచ్చేందుకు తమ పార్టీ గుర్తులతో కూడిన స్వీట్ ప్యాకెట్లను వైసీపీ సిద్ధం చేసింది. అయితే ఈ సమాచారం అందుకున్న అధికారులు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా స్వీట్ బాక్సుల పంపిణీ నిబంధనలకు విరుద్ధమని వాటిని స్వాధీనం చేసుకున్నారు. మచిలీపట్నంలోని ఓ హోటల్‌లో తనిఖీ చేసిన అధికారులు 150 స్వీట్ ప్యాకెట్లతో కూడిన 27 కార్టూన్లతోపాటు మరికొన్ని ఖాళీ బాక్సులను అధికారులు సీజ్ చేశారు. ఈ విషయమై కోడ్ ఆఫ్ కండక్ట్ ఇన్‌స్పెక్టర్ సంపత్ కుమార్ బాధ్యులపై కేసు నమోదు చేస్తామని తెలిపారు. అయితే ఎన్నికల నోటిఫికేషన్ రాక ముందే ఇలా ఉంటే, ఇక ఎన్నికలు దగ్గర పడే నాటికి, ఎన్ని ప్రలోభాలు చూడాలో...