ఆంధ్రప్రదేశ్‌ని కాంగ్రెస్‌ విభజించిందని, టీడీపీ నాశనం చేసిందని ప్రధాని మోదీ విమర్శించారు. అందుకే, ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు కాంగ్రెస్‌, టీడీపీలపై ఆగ్రహంతో ఉన్నారని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలోనూ బీజేపీకి మంచి ఫలితాలే వస్తాయన్నారు. ‘మేరా బూత్‌ సబ్‌సే మజ్బూత్‌’ కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి గురువారం ఆయన మెగా వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సందేశం ఇచ్చారు. ప్రపంచంలోనే అతి పెద్ద వీడియో కాన్ఫరెన్స్‌గా బీజేపీ దీనిని అభివర్ణిస్తోంది. దేశంలోని 15,000 ప్రాంతాల నుంచి దాదాపు కోటి మంది కార్యకర్తలు ఇందులో పాల్గొన్నారు. భారత్‌, పాక్‌ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో, ఈ వీడియో కాన్ఫరెన్స్‌ను రద్దు చేసుకోవాలని, వైమానిక దాడులను రాజకీయం చేయవద్దని బుధవారం ఎన్డీయేతర ప్రతిపక్షాలు హితవు పలికాయి. అయినా.. ఎన్నికల ముందు పార్టీ కార్యకర్తలతో మోదీ ప్రత్యక్షంగా మాట్లాడే ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలనే బీజేపీ నిర్ణయించింది.

modi 01032019

ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ‘‘తమిళనాడులో పటిష్ఠ కూటమిని ఏర్పాటు చేశాం. ఆ రాష్ట్ర చరిత్రలోనే అతి పెద్ద విజయం ఎన్డీయేకు దక్కబోతోంది. కేరళలోని విద్యావంతులైన యువత ఎల్డీఎఫ్‌, యూడీఎఫ్‌లపై విసిగిపోయారు. ఇక, కర్ణాటకలోని కాంగ్రెస్-జేడీఎస్‌ సర్కారు ప్రజల ఆకాంక్షల మేరకు పని చేయడం లేదు. అందుకే, దక్షిణాదిలో ఈసారి ఎన్డీయేకు మరిన్ని సీట్లు వస్తాయని భావిస్తున్నా’’ అని వ్యాఖ్యానించారు. ‘‘దేశాన్ని సుదీర్ఘ కాలంపాటు ఓ అవినీతి ప్రభుత్వం పాలించింది. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు రెండు సంప్రదాయాల్లో ఒకదానిని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. వాటిలో మొదటిది ప్రజాస్వామికంగా పనిచేసే బీజేపీ. రెండోది, వారసత్వ రాజకీయాలు నడిపే కాంగ్రెస్‌, ఇతర పార్టీలు’’ అని అన్నారు.

modi 01032019

నేడే విశాఖకు మోదీ... ప్రధాని మోదీ శుక్రవారం విశాఖపట్నం రానున్నారు. సార్వత్రిక ఎన్నికల వేడి రాజుకుంటున్న సమయంలో ఏపీకి వస్తున్న ప్రధాని.. విశాఖ కేంద్రంగా ప్రకటించిన రైల్వే జోన్‌తోనే సరిపెడతారా.. కొత్త/పాత వరాలు గుప్పిస్తారా.. లేక గుంటూరు సభలో మాదిరిగా చంద్రబాబుపై విమర్శలకే పరిమితమవుతారా? అని అంతా ఆసక్తిగా చూస్తున్నారు. మరోవైపు ప్రత్యేక హోదా, విభజన హామీలు నెరవేర్చని ప్రధానికి రాష్ట్రంలో పర్యటించే అర్హత లేదంటూ టీడీపీ నేతలు జిల్లావ్యాప్తంగా ‘మోదీ గో బ్యాక్‌’ పేరుతో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. హోదా, విభజన హామీల సాధన సమితి ఆధ్వర్యంలో పలువురు ఆమరణ నిరాహారదీక్ష కూడా ప్రారంభించారు. దారి పొడవునా ప్రధానికి నల్లజెండాలతో నిరసన తెలియజేయనున్నాయి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read