‘అన్నదాత సుఖీభవ’కు ఆధార్‌ సీడింగ్‌ అడ్డుగా మారుతోంది. కొన్ని రైతు కుటుంబాలు బ్యాంకు ఖాతాలకు తమ ఆధార్‌ అనుసంధానం చేసుకోకపోవడం, వెబ్‌ల్యాండ్‌తో ఆధార్‌ అనుసంధానం కాకపోవడం వల్ల వారికి లబ్ధి చేకూరని పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ విషయం తెలుసుకున్న చంద్రబాబు, వెంటనే స్పందించారు. అన్నదాత- సుఖీభవ పథకం కింద అర్హులైన ప్రతి రైతు ఖాతాలో పెట్టుబడి సాయం జమ చేస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ విషయంలో ఏ ఒక్క రైతు ఆందోళన చెం దాల్సిన అవసరంలేదని తేల్చి చెప్పింది. ఈ పథకానికి ఆధార్ అడ్డంకిగా ఉందని, ఆధార్‌తో తమ బ్యాంక్ ఖాతాలు అనుసంధానం చేసుకోని 11 లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయం అందలేదని జరుగుతున్న ప్రచారంపై ప్రభుత్వం వివరణ ఇచ్చింది.

farmer 24022019

ఈ ఆరోపణలలో వాస్తవంలేదని ఆధార్‌తో బ్యాంక్ ఖాతాలు అనుసంధానం చేసుకుని వాటిని వినియోగించని రైతులు, బ్యాంక్ ఖాతాలను ఆధార్‌తో అనుసంధానం చేసుకోని రైతుల్లో ఇప్పటికి 3లక్షల మంది రైతుల ఖాతాలను ప్రభుత్వం గుర్తించిందని వారి ఖాతాల్లోకి పెట్టుబడి సాయం నగదు బదిలీ చేసినట్లు పేర్కొంది. ఇంకా ఇలాంటి వారు మరో 11 లక్షల మంది ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. వీరికి కూడా పెట్టుబడి సాయం అందుతుందని ఇందులో ఎలాంటి అపోహలకు గురికావద్దని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. రైతుల వాస్తవ ఖాతాలు నిర్ధారించటం ఒక్క రోజులో పూర్తయ్యేదికాదని, క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ)తో అనుసంధానం చేసుకుని ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా నగదు జమ చేస్తున్నట్లు వివరించింది.

farmer 24022019

ఇందుకోసం క్షేత్రస్థాయిలో అధికారులు, రియల్‌టైమ్ గవర్నెన్స్ అధికారులు రేయింబవళ్లు పనిచేస్తున్నారని పారదర్శకంగా అర్హులందరికీ పెట్టుబడి సాయం అందుతుందని స్పష్టం చేసింది. ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి.. అన్నదాత- సుఖీభవ పథకం అమలు తీరును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న అధికారులతో సమీక్షలు నిర్వహించి సక్రమంగా అమలు చేయాలని పలు సూచనలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతు కుటుంబానికి పెట్టుబడి సాయం చేయాలని నిర్ణయించింది. ఐదెకరాలలోపు రైతులకు రూ.9వేలు, ఐదెకరాలకు పైన ఉన్న రైతులకు రూ.10వేలు ఇవ్వాలని నిర్ణయించింది. ఐదెకరాల లోపున్న రైతులకు కేంద్ర ప్రభుత్వం కూడా రూ.6వేలు అందిస్తోంది. ఐదెకరాల పైన ఉన్న రైతులకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వమే ఆర్థికసాయం చేస్తోంది. ఈ పథకం కింద తొలి విడతగా రైతు కుటుంబాల ఖాతాల్లో వెయ్యి రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం జమచేసే ప్రక్రియ ప్రారంభించింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read