ఎన్నికలకు రోజులు దగ్గర పడుతున్న కొద్దీ.. అన్ని ప్రధాన పక్షాల్లోనూ అలజడి రేగుతోంది. వచ్చేవారు.. వెళ్లే వారిపై దుమారం చెలరేగుతోంది. ఒకరిపై ఒకరికి అనుమానం పెరుగుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ నియోజకవర్గాల వారీగా మారుతున్న పరిణామాలు ఉత్కంఠగా మారాయి. ఓ మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశంలో చేరేందుకు సిద్ధపడు తున్నారు. మరో మాజీ ఎమ్మెల్సీ దెందులూరు నియోజకవర్గంలో వైసీపీ టికెట్ కోసం ప్రయ త్నిస్తున్నారు. ఆచంటకు చెందిన ఒక సీనియర్ నేతతో కలిసి మంత్రి పితాని సీఎం చంద్రబాబుతో కలిసి భేటీ అయ్యారు. నిడదవోలులో అసమ్మతి వర్గం కాలు దువ్వితే.. గోపాలపురంలో కొందరు ఏకమై సీఎంను కలిసేందుకు రాజధాని పయనమయ్యారు. ఇలా ఒక్కొక్కటిగా.. రాజకీయ ఉత్కంఠ కలిగించే పరిణా మాలు.
ఒకేరోజు చోటు చేసుకున్నాయి. వీటన్నింటిపైనా తలో అభిప్రాయం. ఆఖరుకు మంత్రి పితానిని వదంతుల దుమారం వెంటాడుతోంది. మంత్రి పితాని సత్యనారాయణకు వ్యతిరేకంగా వదంతుల దుమారం ఇంకా కొనసాగుతోంది. ఆచంట నియోజకవర్గంలో ఇప్పటికే ప్రచారం ప్రారంభించారు. దీనికి విరుద్దంగా ఆయన ఫలానా పార్టీలో చేరబోతు న్నారని, ముహూర్తం కూడా ఖరారు చేశారంటూ ఆ నోటా ఈ నోటా ప్రచారం ముదిరింది. మంత్రి పితాని దీనిని ఖాతరు చేయకుండా తనపని తాను చేసుకు పోతున్నారు. ఇదిగో పులి.. మాదిరిగానే వైసీపీ మైండ్ గేమ్ ప్రారంభించింది. మంత్రి పితానిని ఇరికించే ప్రయత్నంలో భాగంగా ఈ ప్రచారం చేస్తోంది. చంద్రబాబుకు సన్నిహితుడిగా.. ఉభయ గోదావరి జిల్లాల్లో సీనియర్ బీసీ నేతగావున్న ఆయనను దెబ్బ కొట్టేందుకు వీలుగా ప్రచారం చేస్తున్నట్లు ఆయన చెబుతున్నారు.
తెలుగుదేశం కేడర్ వీటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్న స్పష్టం చేస్తున్నా రు. దీనికితోడు ఆచంట సీనియర్ నేత గొడవర్తి శ్రీరాములుతో కలిసి ఆయన మంగళవారం సీఎం చంద్రబాబును కలుసుకున్నారు. రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం జరగడానికి కొద్దిసేపు ముందుగా సీఎం నివాసంలో ఈ భేటీ జరిగింది. ‘తెలుగుదేశంలో నిర్విరామంగా పనిచేస్తున్నాను. రాబోయే ఎన్నికల్లో నియోజకవర్గంలో పితాని భారీ మెజార్టీతో గెలిచేందుకు వీలుగానే.. మర్యాదపూర్వకంగా సీఎం చంద్రబాబును కలిశాం’ అని గొడవర్తి శ్రీరాములు అన్నారు. ఇప్పటి వరకు జరుగుతున్న ప్రచారానికి తెరదించారు.