డేటా చోరీ కేసులో విజయసాయి రెడ్డి 19.02.2019న ప్రధాన ఎన్నికల అధికారికి ఒక వినతి రాశారు. ‘‘ఆంధ్రప్రదేశ్ - ఇల్లీగల్ యాక్సిస్ టు డిజిటల్ డేటా ఆఫ్ ఇండివిడ్యువల్స్ బై తెలుగుదేశం పార్టీ-కంప్లయింట్-యాక్షన్-రిగార్డింగ్ ’’ పేరుతో వినతి రాశారు. ఆ వినతిని తయారు చేసింది ఫిబ్రవరి 19న అయితే ఈసికి ఇచ్చింది ఫిబ్రవరి 22న. ఫిబ్రవరి 19న విజయసాయి రెడ్డి ఇచ్చిన వినతిలోనే కుట్రకు స్కెచ్ ఉంది. కుట్రకు కార్యాచరణ ప్రణాళిక రాశారు. వినతికి అనుబంధంగా కుట్ర యాక్షన్ ప్లాన్ కూడా ఈసికి అందించారు. రాసుకున్న స్కెచ్ కూడా ఈసికి వినతిలో జత చేశారు. అక్కడే దుష్టచతుష్టయం మహాకుట్ర బైటపడింది. ఈ కుట్ర ‘బాహుబలి’ కుట్రలను మించిపోయింది. ఈసికి ఇచ్చిన వినతిలో యాక్షన్ పాయింట్స్, టాకింగ్ పాయింట్స్ కూడా పొరపాటున పెట్టి ఇచ్చారు.
సోదాల్లో ఐటి గ్రిడ్ ఆఫీసులో ఏం చేయాలి..? ఎవరెవరిని ఎలా ఇబ్బందులు పెట్టాలి..? కుట్ర స్కెచ్ యాక్షన్ ప్లాన్లో అన్నీ రాశారు. ‘‘ప్లాన్ ఆఫ్ యాక్షన్’’ అంతా అందులో రాసుకున్నారు-సెర్చ్, ఎఫ్ ఐఆర్ రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి, డేటా సీజ్ చేయడం, ఉద్యోగుల సెల్ ఫోన్లు లాగేసుకోవడం, వేధింపులు-బెదిరింపులు,సేవామిత్ర యాప్ ను డిజేబుల్ చేయడం, సేవామిత్ర కీలక కార్యకర్తలను గుర్తించి బెదిరించడం, కోర్ట్ ద్వారా సిబిఐ విచారణ కోరడం, నేషనల్ మీడియా అటెన్షన్ డ్రా చేయడం, సిఈవోకు, ఉడాయ్ కు లెటర్స్ పంపాలని అనడం, ఐటి గ్రిడ్ కంపెనీపై సోదాలపై అల్లరి చేయడం.... కొందరు మంత్రులను కూడా టార్గెట్ చేయాలని రాశారు. ఉన్నతాధికారులను, తెలుగుదేశం నేతలను టార్గెట్ చేయాలని రాశారు. ఇది విజయసాయి ప్లాన్ అఫ్ ఆక్షన్..
అయితే ఈ ప్లాన్ అఫ్ ఆక్షన్ లో, కొంత భాగం కేసీఆర్ మొదలు పెట్టగా, ఇప్పుడు ఇందులో మరో పాయింట్ జరిగేలా చూడటానికి బీజేపీ బయలుదేరింది. డేటా చోరీపై సీబీఐ విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందని, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. శుక్రవారం ఢిల్లీలో కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ సునీల్ అరోరాను బీజేపీ రాష్ట్ర ఇన్చార్జి మురళీధరన్, రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఎంపీ జీవీఎల్ నరసింహా రావు, ఎమ్మెల్సీ మాధవ్ కలిసి వినతి పత్రం అందించారు. ‘‘ఎన్నికల్లో విజయం సాధించడానికి టీడీపీ తప్పుడు పనులు చేస్తోంది. ఓటర్ల జాబితా నుంచి అనుకూలంగా లేని వారిని తొలగించి టీడీపీ బోగస్ ఓట్లను చేర్చింది. సీనియర్ ఉన్నతాధికారులు టీడీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారు. అధికారులపైనా చర్యలు తీసుకోవాలి. సాధికార మిత్ర కోసం నియమించుకున్న 4 లక్షల మందిని బాధ్యతల నుంచి తప్పించాలి. బోగస్ ఓట్ల తొలగింపునకు సమయం లేదని కమిషనర్ అన్నారు’’ అని తెలిపారు.