సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అంటే తెలియని వారు తెలుగు రాష్ట్రాల్లో ఉండరు. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో, ఆయన ఇద్దరు కొడుకులు, అంటే ఒకరు సొంత కొడుకు జగన్, మరొకరు దేవుడిచ్చిన పెద్ద కొడుకు గాలి జనార్ధన్ రెడ్డిల అక్రమ సంపాదన గుట్టు బయటకు లాగి, వాళ్ళు తిన్నది అంతా కక్కించటానికి చేసిన ప్రయత్నం అందరికీ గుర్తుండే ఉంటుంది. కోర్ట్ ల్లో దాదపుగా ఇద్దరూ దోషులుగా మిగిలిపోయారు. ఇద్దరూ చిప్ప కూడు తిని, కండీషనల్ బెయిల్ పై బయట తిరుగుతున్నారు. అయితే, ఇప్పుడు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పదవీ విరమణ చేసి రాజకీయాల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఆయన సొంత పార్టీ పెడతారానికి, జనసేనలోకి వెళ్తారని, ఇలా రకరకాల ప్రచారాలు జరిగాయి.
అయితే ఇప్పుడు వస్తున్న తాజా సమాచారం ప్రకారం, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ త్వరలో చంద్రబాబును కలిసి, ఆయన సారధ్యంలో రాష్ట్రానికి, ముఖ్యంగా రైతులకు సేవ చెయ్యటానికి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో పర్యటించి, రైతు సమస్యల పై అవగహన చేసుకున్నారు. నేను సొంత పార్టీ పెట్టినా, ఏదైనా పార్టీలో చేరినా, రైతులకు మేలు చెయ్యటమే నా ఎజెండా అని ఇప్పటికే ఆయన చెప్పారు. ఈ నేపధ్యంలోనే, చంద్రబాబు రైతులకు, ఇరిగేషన్ ప్రాజెక్ట్ లకు ఇస్తున్న ప్రాధాన్యత చూసి, చంద్రబాబుతో కలిసి ప్రయాణం చేసే అవకాసం ఉన్నట్టు తెలుస్తుంది. ఈ నేపదంలోనే, లక్ష్మీనారాయణ, సీనియర్ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆదివారం హైదరాబాద్‌లో భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా ఆయన తెదేపాలోకి వచ్చేందుకు సుముఖత చూపారని, రెండు, మూడు రోజుల్లో చంద్రబాబుతో భేటీ అయ్యే అవకాశముందని పార్టీ వర్గాల సమాచారం. విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గం నుంచి ఆయన ఎన్నికల బరిలో నిలిచే అవకాశముంది. తొలుత ఇక్కడి నుంచి మంత్రి లోకేశ్ పోటీ చేయాలని భావించినా.. తాజా పరిణామాల నేపథ్యంలో ఆయన విశాఖపట్నం ఉత్తరం నియోజకవర్గంనుంచి పోటీచేసే యోచన చేస్తున్నట్లు సమాచారం. కాగా ఇప్పటి వరకూ ఈ నియోజకవర్గం నుంచి సీఎం చంద్రబాబు తనయుడు, మంత్రి నారా లోకేశ్ భీమిలి నుంచి పోటీ చేస్తారని.. ప్రస్తుతం ఆ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్న గంటా శ్రీనివాసరావు ఎంపీగా పోటీ చేస్తారని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే విశాఖ ఉత్తర నుంచి లోకేశ్‌ను పోటీ చేయించాలని చంద్రబాబు ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది.