వైసీపీకి గుడ్‌బై చెప్పిన తరువాత టీడీపీలో చేరే విషయంలో ఆలోచనలో పడ్డ మాజీ ఎమ్మెల్యే, వంగవీటి రంగా తనయుడు వంగవీటి రాధా... నేడు అధికారికంగా టీడీపీ కండువా కప్పుకోనున్నట్టు తెలుస్తోంది. సోమవారం అర్థరాత్రి మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌తో కలిసి ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుతో సమావేశమైన వంగవీటి రాధ... ఆయనతో పలు అంశాలపై చర్చించినట్టు టాక్ వినిపిస్తోంది. విజయవాడలోని పేదల ఇళ్ల పట్టాలకు సంబంధించి వారి మధ్య చర్చకు వచ్చినట్టు సమాచారం. ఇందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సానుకూలంగా స్పందించడంతో... నేడు మరోసారి చంద్రబాబును కలిసి అధికారికంగా టీడీపీలో చేరాలని వంగవీటి రాధాకృష్ణ నిర్ణయించుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

vangaveet 12032019

రాజీనామా చేసిన రెండ్రోజులకే ఆయన పసుపు కండువా కప్పుకుంటారని వార్తలు వచ్చినప్పటికీ అవన్నీ పుకార్లేనని తేలిపోయింది. అంతేకాదు రాధా టీడీపీలోకి వస్తున్నారని.. అందరూ సహకరించి కలిసి మెలిసి పనిచేయాలని స్వయానా సీఎం చంద్రబాబే చెప్పారు. అయితే ఈ మధ్యలో ఏం జరిగిందో ఏమోగానీ మళ్లీ సైకిలెక్కకుండా సైలెంట్ అయిపోయారు. దీంతో మరోసారి విజయవాడకు చెందిన వైసీపీ కీలకనేతలు రంగంలోకి దిగి పార్టీలోకి రీ-ఎంట్రీ ఇవ్వాలని మంతనాలు కూడా జరిపారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. సోమవారం అర్ధరాత్రి సీఎం చంద్రబాబు నివాసానికి వంగవీటి రాధా వెళ్లారు. మాజీ ఎంపీ లగడపాటితో కలిసి రాధా .. సీఎంతో భేటీ అయ్యారు.

vangaveet 12032019

సుమారు రెండుగంటలపాటు రాధా తన రాజకీయ భవిష్యత్‌పై సీఎంతో చర్చించినట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించాలని రాదా కోరినట్టు సమాచారం. దీని పై కసరత్తు చేస్తున్న చంద్రబాబు, ఆయనకు మచిలీపట్నం ఎంపీ సీటు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. విజయవాడలో ఎమ్మెల్యే సీట్లకు అభ్యర్థులను ఇప్పటికే ఖరారు చేసిన నేపథ్యంలో... ఆయనను మచిలీపట్నం ఎంపీగా బరిలోకి దింపాలని టీడీపీ భావిస్తోంది. ప్రస్తుతం మచిలీపట్నం ఎంపీగా ఉన్న టీడీపీ నేత కొనకళ్ల నారాయణను ఎమ్మెల్యే పోటీ చేయించి... రాధాను ఎంపీగా బరిలోకి దింపాలని చంద్రబాబు డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. ఇందుకు రాధా కూడా అంగీకరించినట్టు ప్రచారం జరుగుతోంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read