ప్రజా క్షేత్రంలో లో గెలవడం సాధ్యం కాదు,అభివృద్ధి - సంక్షేమంలో చంద్రబాబు తో పోటీ పడలేం.మరి చంద్రబాబు ని దెబ్బతీయడం ఎలా?అని ఆలోచించిన జగన్ కన్నింగ్ బ్రెయిన్ కి ఒక అద్భుతమైన ఐడియా వచ్చింది. తెలుగుదేశం పార్టీ ని దెబ్బతియ్యడానికి అదే సరైన మార్గం అని లోటస్ పాండ్ లో స్కెచ్ వేసారు. లోటస్ పాండ్ లో జరిగిన యువరాజుల సమావేశంలో మాస్టర్ ప్లాన్ అమలు పై ఒక నిర్ణయానికి వచ్చారు.సమాచారాన్ని మోదీ గారికి అందించారు.ఢిల్లీ నుండి గ్రీన్ సిగ్నల్ రాగానే దాడులు మొదలుపెట్టారు.తెలుగుదేశం టెక్నాలజి వినియోగంలో జాతీయ పార్టీలు సైతం ఊహించని అంత ముందు ఉంది టెక్నాలజీ పై తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న చంద్రబాబు గారు పార్టీ లో టెలికాన్ఫరెన్స్ మొదలుకొని అనేక విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. నారా లోకేష్ పూర్తి స్థాయి ఆన్ లైన్ సభ్యత్వ నమోదు,సేవ మిత్ర ఇలా అనేక కార్యక్రమాలు రూపొందించారు. దేశంలో ఏ పార్టీ తనకి ఉన్న కార్యకర్త ఎవరు?ఏ ఊరిలో ఎంత మంది కార్యకర్తలు ఉన్నారు అని చెప్పలేరు.కానీ తెలుగుదేశం పార్టీ లో డిజిటల్ సభ్యత్వ నమోదు కార్డు ఉంటుంది.కార్యకర్త కి ఒక గుర్తింపు ఉంటుంది. తెలుగుదేశం పార్టీని దెబ్బకొట్టాలి అంటే ఈ సమాచారం దొంగలించాలి. ఆ సమాచారం ఆధారంగా వారి ఓట్లు తొలగించటం, బూత్ కన్వీనర్లను కొనేసే ఎత్తుగడ వేసారు. ఇదే జగన్ క్రిమినల్ మైండ్ ఆలోచన. దీనికి కేసీఆర్ అండదండలు.తెలుగుదేశం పార్టీ సబ్యత్వ నమోదు డేటా ఉండే వారి పై దాడి చెయ్యాలి,తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసే కంపెనీలను భయబ్రాంతులకు గురిచేయ్యాలి అనే కుహనా ఆలోచనతో జగన్ తెలంగాణ పోలీసుల సహకారంతో తెలుగుదేశం పార్టీ కి ఐటీ సర్వీసులు ఇచ్చే ఐటీ గ్రిడ్స్ కంపెనీ పై దాడులు చేసారు.
సాయంత్రం 4 గంటల నుండి తెల్లవారుజామున 2 గంటల వరకూ సెర్చ్ ఆపరేషన్ అంటూ యుద్ధ వాతావరణం సృష్టించారు.20 మంది కానిస్టేబుల్లు,2 ఎస్ఐ,సిఐ ఆఖరికి ఏసీపీ కూడా రంగంలోకి దిగారు.కంపెనీ యజమాని పై ప్రశ్నల వర్షం, మీ దగ్గర ఉన్న డేటా మాకు ఇవ్వాలి అని ఒత్తిడి ,మీరు తయారు చేసిన యాప్స్ గురించి వివరించండి.ఇక్కడ ఉన్న సమాచారం అంతా మాకు కావాలి.పార్టీ లో ఉన్న కార్యకర్తల డేటా,బూత్ కన్వినర్లు,సేవ మిత్ర ఇలా మొత్తం సమాచారం కావాలి అంటూ ఒత్తిడి తెచ్చారు.అయ్యా మేము కేవలం టెక్నికల్ సపోర్ట్ మాత్రమే ఇస్తాం, డేటా మా దగ్గర ఉండదు అని యజమాని మొత్తుకున్నా వదలలేదు...నీ ఇల్లు ఎక్కడ,నీ ఫ్యామిలి సమాచారం చెప్పు అని పోలిసులు ఒత్తిడి తెచ్చారు.అంతే కాదు హెచ్ ఆర్ దగ్గర నుండి పనిచేసే ఉద్యోగస్తుల వరకూ ఫోన్లు చేస్తూ ఒత్తిడి చేసి వారు కంపెనీ కి రిజైన్ చెయ్యాలి అని ఒత్తిడి చేసారు. తెలుగుదేశం పార్టీ కీలక సమాచారం తెలుసుకొని మోడీ సహకారం తో ప్రతి నియోజకవర్గం లో తెలుగుదేశం పార్టీకి పక్కా అనుకున్న కనీసం 10 వేల ఓట్లు తొలగించడం,బూత్ కన్వినర్లు,సేవ మిత్రల సమాచారం తెలుసుకొని వారి పై దాడులు చేసేందుకు జగన్ పక్కా వ్యూహంతో ఈ దాడులకు తెగబడుతున్నారు అని తెలుగుదేశం నేతలు చెప్తున్నారు.
దీని కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్,కొడుకు కేటీఆర్ ప్రత్యేకంగా కొంత మంది ఆఫీసర్లను కేటాయించి సమాచారం తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారని టిడిపి ఆరోపిస్తుంది. టిడిపి నేతలు చెప్పిన దాని ప్రకారం "తమ భూ భాగం లో ఉన్న ఐటీ కంపెనీ కాబట్టీ సమాచారం పోలీసుల ఒత్తిడి తో తీసుకుంటాం కాదు అంటే సైబర్ ఎక్స్పర్ట్స్ ని పెట్టి తెలుగుదేశం పార్టీ సమాచారం దొంగిలించి పూర్తి స్థాయి లో తెలుగుదేశం పార్టీని దెబ్బతిస్తాం అని పక్కా వ్యూహం సిద్ధం చేసారు. 840 విజయసాయి ఫిర్యాదు ని భూచి గా చూపించి తెలుగుదేశం పార్టీ కీలక సమాచారం దొంగలించి తెలుగుదేశం పార్టీ ని ఎన్నికల్లో దెబ్బతియ్యడం ద్వారా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి అని ఫార్మ్ హౌస్ దొర కలలు కంటున్నాడు.లోటస్ పాండ్ వేదికగా బీహార్ గ్యాంగ్ పీకే కి ఎప్పటికప్పడు సమాచారం అందిస్తున్న కేటీఆర్ ఆధ్వర్యంలో పెద్ద కుట్రే జరుగుతుంది.ప్రతి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కి పక్కా అనుకున్న 5 నుండి 10 వేల ఓట్ల సమాచారం దొంగలించి వాటిని తొలగించాలి అని ఎన్నికల కమిషన్ కి 420 పార్టీ ఫిర్యాదు చేసింది.175 నియోజకవర్గాల్లో తెలుగుదేశం ఓట్లు తొలగించాలి అని దొంగ అబ్బాయి వేసిన ప్లాన్ కి కేసీఆర్ అన్ని రకాలుగా సపోర్ట్ అందిస్తున్నారు." అని తెలుగుదేశం నేతలు చెప్తున్నారు.