ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య డేటా యుద్ధం నడుస్తోంది. పోటా పోటీ పిర్యాదులతో అటు ఏపీ, ఇటు తెలంగాణ పోలీసులు రంగంలోకి దిగారు. టీడీపీకి సేవలు అందిస్తున్న ఐటీ కంపెనీలో తెలంగాణ పోలీసుల సోదాలతో వివాదం రాజుకుంది. సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. తమ డేటాను తీసుకునేందుకు వైసీపీ, టీఆర్ఎస్ కలిసి కుట్రలు చేస్తున్నాయని టీడీపీ ఆరోపించింది. తెలంగాణ పోలీసులను ముందుపెట్టి తెరవెనుక మంత్రాంగం నడిపిస్తున్నారని మండిపడింది. దీనిపై ఏపీ పోలీసులకు పిర్యాదు చేసింది. తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఉన్న ఐటీ కంపెనీని 30 మంది తెలంగాణ పోలీసులు చుట్టుముట్టి తెల్లవారుజాము వరకు సోదాలు నిర్వహించారని ఏపీ మంత్రి కళావెంకట్రావ్ అన్నారు.

police 03032019

వారికి ఎలాంటి సమాచారం అందకపోవడంతో కంపెనీ ఐటీ ఉద్యోగులను కిడ్నాప్ చేశారని చెప్పారు. అందుబాటులో లేని ఉద్యోగుల కుటుంబ సభ్యులను తీసుకువెళ్లి వేధింపులకు గురిచేశారని, ఆ కంపెనీలో పనిచేస్తున్న నలుగురు ఐటీ ఉద్యోగులను అరెస్టు చేసి తీవ్రంగా వేధిస్తున్నారని ఆయన ఆరోపించారు. కేంద్రం, తెలంగాణ ప్రభుత్వాలు చట్ట వ్యతిరేకంగా సోదాలు, కిడ్నాప్‌లు, బెదిరింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ పోలీసులను ముందుపెట్టుకుని తెరవెనుక ఉండి నడిపిస్తున్న ముగ్గురు నేతల గుట్టు త్వరలోనే రట్టు చేస్తామని అన్నారు. విజయసాయి రెడ్డి పిర్యాదుపై తెలంగాణ పోలీసులు ఆఘమేఘాలపై స్పందించి దాడులు చేశారని కళా వెంకట్రావ్ విమర్శించారు.

police 03032019

‘‘ఇరవయ్యేళ్లుగా తెలుగుదేశం కార్యకర్తల డేటాను సేకరించాం. ఏ యూనిట్‌ ఎలా పనిచేస్తుంది? తెలుసుకొని ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేసుకుంటున్నాం. ఆ సాప్ట్‌వేర్‌ కంపెనీ హైదరాబాద్‌లో ఉంటే ఆ కంపెనీపైకి పోలీసులను పంపిస్తారా? విజయసాయిరెడ్డి ఫిర్యాదు చేస్తే కేసీఆర్‌ ప్రభుత్వం దాడిచేస్తుందా?’’ అని చంద్రబాబు కర్నూలు సభలో నిలదీశారు. ‘‘మా ఆర్థిక మూలాలు పట్టుకొని జగన్‌కు సహకరించాలని మాపై దాడులు చేస్తే చూస్తూ ఊరుకోం’’ అని హెచ్చరించారు. వైసీపీ నేతలు టీడీపీ కార్యకర్తలు, సేవామిత్రల సమాచారాన్ని సంగ్రహించేందుకే ఈ ఎత్తులు వేస్తున్నారని ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు ఆరోపించారు. ఏపీ టీడీపీ నేతల ఫిర్యాదుపై ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు కూడా అక్కడికి వచ్చారు. ఐటీ కంపెనీపై సోదాలను ఏపీ సీఎం చంద్రబాబు తీవ్రంగా తప్పుబట్టారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read