టీడీపీలో చేరికలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ఈ చేరికలు టీడీపీ గెలిచే పార్టీ అనే భావనను తీసుకొచ్చేందుకు బాగా ఉపయోగపడుతున్నాయి. ముందుగా ఈ రేసును వైసీపీ మొదలు పెట్టింది. ఇద్దరు ఎంపీలు, ఇద్దరు ఎమ్మెల్యేలను చేర్చుకుని హడావుడి చేసింది. కానీ వారంతా టికెట్లు రానివారన్న క్లారిటీ రావడం.. దిగ్గజాలన్న నేతలు కనీసం వైసీపీ వైపు చూడకపోతుండటంతో టీడీపీ దీనిని పకడ్బందీగా ఉపయోగించకుంటోంది. గెలిచే పార్టీ అన్న ఇమేజ్‌ను నిలబెట్టుకుంటోంది. నేటికీ లోటస్‌పాండ్‌లో జగన్ రోజూ కండువాలు కప్పే కార్యక్రమాన్ని చేపడుతూనే ఉన్నారు. కానీ ఏ ఒక్క నేత కూడా ప్రజాబలం ఉన్నవారు కాకపోవడంతో రాజకీయ వర్గాలు పెదవి విరుస్తున్నాయి.

cbn 022032019

20 ఏళ్ల క్రితం రాజకీయాలు మానుకున్న దాసరి జైరమేష్, అసలెప్పుడూ ప్రత్యక్ష రాజకీయాల్లో లేని నార్నే శ్రీనివాసరావులతో పాటు నియోజకవర్గాల్లో ద్వితీయ శ్రేణిలో ఉన్న నేతలకు కూడా జగన్ స్వయంగా కండువాలు కప్పుతున్నారు. కానీ అనుకున్నంత బజ్ రావడం లేదు. టీడీపీలో టికెట్లు గ్యారంటీ లేని మరికొందరు నేతలు కూడా వైసీపీతో టచ్‌లో ఉన్నారు. అయితే వారిని చేర్చుకుంటే ఇప్పటికే ఉన్నవారికి ఇబ్బందవుతుందని.. వారు తిరుగుబాటు చేస్తే మొదటికే మోసం వస్తుందని వైసీపీ నేతలు ఆగిపోతున్నారు. తోట త్రిమూర్తులు, మోదుగుల వేణుగోపాలరెడ్డి వంటి వారు ఈ జాబితాలో ఉన్నారు.

cbn 022032019

ఇప్పటికే చీరాలలో ఆమంచి చేరికతో యడం బాలాజీ వైసీపీ గుడ్ బై చెప్పారు. రేపో, మాపో టీడీపీలో చేరనున్నారు. దీంతో చేర్చుకున్నవారి బలం కన్నా.. ఇంతకాలం పార్టీ కోసం పనిచేసిన వారు దూరమవటం వైసీపీకి నష్టంగా మారింది. టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. పలువురికి టికెట్లు నిరాకరించినప్పటికీ వారిని పిలిచి మాట్లాడుతున్నారు. భవిష్యతులో న్యాయం చేస్తామని బుజ్జగిస్తున్నారు. కర్నూలులో వరుసగా పార్టీ నేతలు చేరుతున్నప్పటికీ ఎవరికీ అసంతృప్తి లేకుండా చేస్తున్నారు. వరుసగా షెడ్యూల్ ప్రకారం కీలక నేతలను చేర్చుకుంటూ ఉండటంతో గెలిచే పార్టీ అన్న ఇమేజ్‌ను చంద్రబాబు పెంచుకుంటూ పోయే ప్రణాళిక అమలు చేస్తున్నారు. టీడీపీలో చేరుతున్న దిగ్గజ నేతలందరినీ వైసీపీ సంప్రదించింది. కానీ ఆ పార్టీ వైపు ఎవరూ చూడటం లేదు.

 

 

Advertisements

Advertisements

Latest Articles

Most Read