వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధినేత వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డి శనివారం త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. శనివారం సాయంత్రం ఢిల్లీ నుండి హైదరాబాద్ వచ్చిన జగన్ రాజీవ్ గాంధీ విమానాశ్రయం నుండి నేరుగా ముచ్చింతల్‌లోని చినజీయర్ ఆశ్రమం (శ్రీరామనగర్) వచ్చారు. చిన్న జీయర్ ఆశ్రమానికి వచ్చిన జగన్‌కు ఆశ్రమం వెలుపల జీయర్ స్వయంగా ఆప్యాయంగా స్వాగతం పలికారు. ఆ తర్వాత ఆశ్రమం మొదటి అంతస్తుపైకి జగన్‌ను తీసుకువెళ్లారు. ఆశ్రమం మొదటి అంతస్తులో జీయర్ తరచూ ప్రముఖులతో సమావేశం అయ్యే హాలులోనే జగన్‌తో కొద్దిసేపు చర్చించారు. కొద్దిసేపు జీయర్‌తో గడిపిన జగన్ ఆ తర్వాత వెళ్లిపోయారు. అయితే అక్కడ జగన్ వినయం నటించిన విధానం చూసి అందరూ అవాక్కయ్యారు.
ఒకప్పుడు సెక్యూరిటీని ఒంగోపెట్టి, అతని వీపు మీద మైకులు పెట్టి, అరగంట ప్రెస్ మీట్ పెట్టిన చరిత్ర... ఇప్పుడు ఒంగోపెట్టే స్థాయి నుంచి, ఎవరు కనిపిస్తే వాళ్ళ ముందు ఒంగునే దాకా వచ్చాడు... అతని అహంభావం తెలిసిన వాళ్ళు ఎవరూ, ఆశ్చర్యపోక మానరు... ఈ సాములోరిని, కేసీఆర్ అయితే ఏకంగా ముఖ్యమంత్రి కుర్చీ మీదే కూర్చోబెట్టాడు... పాపం జగన్ కు, ఆ కుర్చీ లేదు కాబట్టి, వెళ్లి నేల మీద కూర్చుని ఒక ఫోటో దిగారు... ఈ మొత్తం ఎపిసోడ్ లో జగన్ ప్రవర్తన చూసి, షాక్ అయ్యారు, జగన్ తో పని చేసి, చేస్తున్న నాయకులు... నిన్న అయితే, అయినలో ఒక అపరిచితుడిని చూసాం అంటున్నారు... అంబటి లాంటి వాళ్ళు అయితే, ఛీ పోండి ఆయన మా జగన్ కాదు,మా అన్న స్టైల్ ఇది కాదు అంటూ మీడియాతో అంటున్నారు...
నిజానికి జగన్ చాలా బలుపుతో ఉంటాడు... ఎవరినీ లెక్క చెయ్యని మనస్తత్వం... తండ్రితో సమాన వయసు ఉన్న వారు కూడా, అతని ముందు నుంచుని చేతులు కట్టుకుని మాట్లాడాల్సిందే... సినిమా ఆక్టర్ రాజశేఖర్ చెప్పినట్టు, జీన్స్ ఫ్యాంట్ వేసుకు వచ్చినా తట్టుకోలేడు.. అలాంటిది, నిన్న చినజీయర్ ని కలిసిన వేళ, జగన్ ఆక్టింగ్ ఇరగదీసాడు అని సినీ వర్గాలు కూడా మెచ్చుకుంటుయి... చినజీయర్ ని కలిసిన టైంలో పూర్తి వినయపూర్వకంగా వ్యవహరించారు. చేతులు కిందికి వదలకుండా, కాళ్లకు చెప్పులు లేకుండా ఆయనతో నడిచారు. జగన్‌కు జీయర్ స్వామి కింది దాకా వచ్చి వీడ్కోలు పలికారు. అలా వెళ్లే సమయంలో... జగన్ తొలుత చేతులతో నమస్కరించి, ఆపై రెండు పాదాలను తాకి నమస్కరించి జీయర్ ఆశీస్సులను పొందారు. ఆ విధంగా, జగన్ లోని మరో కోణం చూసామని, ఇంత వినయంగా మాతో కూడా ఉంటే, ఈ పాటికి పరిస్థితి వేరేలా ఉండేది అని, లోటస్ పాండ్ లో ఉన్న నాయకులు అంటున్నారు...