వైకాపాకు చెందిన నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని పోలీసులు శనివారం అరెస్ట్‌చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారన్న కారణంతో ఆయనపై వేదాయపాలెం పోలీస్‌స్టేషన్‌లో నాన్‌బెయిలబుల్‌ కేసు నమోదైంది. నేటి నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించిన శ్రీధర్‌రెడ్డి నెల్లూరులోని వైకాపా కార్యాలయం వద్ద దీక్షకు దిగారు. ఈ నేపథ్యంలో శ్రీధర్‌రెడ్డిని అరెస్ట్‌ చేసేందుకు పోలీసులు వెళ్లగా.. ఆ పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు. అరెస్ట్‌కు నిరసనగా కార్యాలయం ముందు శ్రీధర్‌రెడ్డి భైఠాయించారు. దీంతో వైకాపా కార్యాలయం వద్ద కాసేపు ఉద్రిక్తత నెలకొంది. అయితే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని పోలీసులు, కోర్టులో హాజరుపరిచారు. దీంతో న్యాయమూర్తి ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించారు. ఈ నేపథ్యంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని తొలుత జిల్లా ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లిన పోలీసులు వైద్యపరీక్షలు చేయించారు. అనంతరం సెంట్రల్ జైలుకు తరలించారు.

kotamreddy 09032019 1

అంతకుముందు వేదాయపాళెం పోలీసు స్టేషన్‌లో ఎమ్మెల్యే హల్‌చల్‌ చేశారు. గురువారం అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో పోలీసు స్టేషన్‌కు తమ అనుచరులతో కలిసి చేరుకుని సీఐ నరసింహారావుతో వాగ్వాదానికి దిగారు. వివరాల మేరకు.. గురువారం ఓ ప్రైవేటు సంస్థ నగరంలో సర్వే నిర్వహిస్తోంది. అయితే స్థానిక వైకాపా నాయకులు హజరత్‌ నాయుడు, శ్రీనివాసులు, మరికొంత మంది కలిసి వారి నుంచి ట్యాబులు లాక్కొని దాడికి పాల్పడినట్లు సమాచారం. ఈ విషయంపై సర్వే చేస్తున్న సిబ్బందిపై కేసులు నమోదు చేయాలని స్థానిక నాయకులు పోలీసులను కోరారు. అయితే పోలీసులు వారిని స్టేషన్‌లోనే ఉంచుకున్నారు. వైకాపా నాయకులపై కేసులు నమోదు చేశారు. అనంతరం ఈ విషయంపై మాట్లాడేందుకు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పోలీసు స్టేషన్‌కు చేరుకుని పోలీసులతో మాట్లాడారు. ఒకానొక సమయంలో స్టేషన్‌లో కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

 

kotamreddy 09032019 1

వైకాపా నాయకులు శ్రీకాంత్‌ రెడ్డి కూడా సీఐతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే తన అనుచరుడితో మాట్లాడుతూ సీఐ నిన్ను కులం పేరుతో దూషించాడని, సీఐపై కేసు నమోదు చేయాలంటూ పోలీసులకు చెప్పారు. ఓట్లను తొలగిస్తున్నారని, వైకాపా నాయకులు ఫిర్యాదు చేస్తే వారిపైనే కేసులు నమోదు చేస్తారా.. అంటూ పెద్ద కేకలతో పోలీసులతో మాట్లాడారు. మీ ఎస్పీ, డీజీని ఎవరిని పిలుస్తావో పిలువు అంటూ భీష్మించుకుకూర్చొన్నారు. దీంతో ఈ సంఘటన జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఎమ్మెల్యే పోలీసులను బెదిరిస్తున్నారంటూ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ అయింది. ఎమ్మెల్యేతో వచ్చిన నాయకులు జరిగిన సంఘటన మొత్తం చిత్రీకరించి వాట్సాప్‌లో పొందుపరచడంతో విషయం అందరికి తెలిసింది.

 

Advertisements

Advertisements

Latest Articles

Most Read