నెల్లూరు గ్రామీణ వైకాపా ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గురువారం అర్ధరాత్రి పోలీస్‌స్టేషన్‌లో హల్‌చల్ చేశారు. పోలీసులపై తీవ్ర స్థాయిలో గొడవకు దిగారు. ‘నా ప్రొటోకాల్ మీకు తెలుసా’ అంటూ పోలీసులపై విరుచుకుపడ్డారు. తమ పార్టీ కార్యకర్తలను అరెస్ట్ చేశారన్న ఆగ్రహంతో అర్ధరాత్రి దౌర్జాన్యానికి పాల్పడ్డారు. సర్వే చేస్తున్నారన్న అనుమానంతో బెంగళూరుకు చెందిన కొందరు యువకులపై స్థానిక వైకాపా కార్యకర్తలు దాడి చేశారు. బాధితుల ఫిర్యాదుతో ఐదో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో వైకాపా కార్యకర్తలపై కేసునమోదైంది. పోలీసులు వారిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. దీంతో వారిని విడుదల చేయాలని గ్రామీణ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి అర్ధరాత్రి పార్టీ కార్యకర్తలతో పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి వారితో వాగ్వాదానికి దిగారు. పోలీసులపై బెదిరింపులకు పాల్పడ్డారు.
జిల్లాలోని వేదాయపాలెం పోలీస్‌స్టేషన్‌లో వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డితో పాటు ఆయన అనుచరులు హల్‌చల్ చేశారు. సీఐలో పాటు ఇతర పోలీస్ సిబ్బందిని బెదిరించారు. ఎస్పీని డీజీని పిలువు అంటూ ధౌర్జన్యంగా వ్యవహరించారు. దీంతో పోలీస్‌స్టేషన్‌లో గంట పాటు ఉద్రిక్తత నెలకొంది. నేతాజీనగర్‌లో సాధికారత సర్వేకు వెళ్లిన నలుగురిపై వైసీపీ కార్యకర్తలు దాడి చేసి తీవ్రంగా కొట్టారు. ఈ ఘటనపై వేదాయపాలెం పోలీసులు వైసీపీ కార్యకర్తలపై కేసు నమోదు చేశారు. నిందితులకు వైద్య పరీక్షలు అనంతరం కోర్టులో హాజరుపరాల్సి ఉంటుంది. అయితే తమ పార్టీకి చెందిన కార్యకర్తలను ఎందుకు కోర్టులో హాజరుపర్చలేదని శ్రీధర్‌రెడ్డి చిందులు తొక్కారు. డీజీ కంటే తన ప్రొటొకాల్ ఎక్కువ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే శ్రీధర్‌రెడ్డి, ఆయన అనుచరుల ప్రవర్తనపై పోలీసులు మండిపడుతున్నారు. డ్యూటీ చేస్తున్న సీఐ, ఇతర అధికారులను బెదిరించడం సరికాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.