వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఆ మైనింగ్ కింగ్ చక్రం తిప్పుతున్నాడు. అర్ధబలం అంగబలం తొడుచేసుకొని పార్టీ నేతలను తనవైపు తిప్పుకుంటున్నాడు. సీనియర్లకు చెక్ పెట్టి నెంబర్ పొజిషన్ కోసం పక్కా యాక్షన్ ప్లాన్ అమలు అమలు చేస్తున్నారు. చాపకింద నీరులా తన పరిధిని విస్తరించుకుంటూ వైసీపీలో ప్రభావాన్ని పెంచుకుంటున్నారు. ప్రస్తుత రాజకీయాలలో మనుగడ సాధించాలంటే డబ్బు చాలా అవసరం. ఇదిగో ఇదే విషయాన్ని తనకు అన్వయించుకోని పక్క ప్రణాళికలతో దూసుకుపోతున్నాడు నెల్లూరు వైసీపీ నేత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. తన అర్ధభలం తో పార్టికి ఆర్ధిక శక్తిగా నిలిచారు. ఎమ్మెల్యేలు సెకండరి గ్రేడ్ నేతలకు దన్నుగా నిలిచారు. ఎన్నికల భరిలో నిలిచేందుకు అయ్యే ఖర్చులను భరించేందుకు సిద్దమనే సంకేతాలు పంపుతున్నారు. ఫలితంగా వైసీపీలోని నేతలందరికీ జగన్ ప్రత్యామ్నాయ నేతగా వేమిరెడ్డి నిలుస్తున్నారు. వైసీపీ నెంబర్ టూ స్థానం తనదేననే ఇండికేషన్ ఇస్తున్నారు.
వేమిరెడ్డి నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ కీలక నేత. రాజ్యసభ సభ్యులు. స్వతహాగా వ్యాపారవేత్త అయిన ప్రభాకర్ రెడ్డికి మన రాష్ట్రంలోనే కాకుడా కర్ణాటక తమిళనాడు రాష్ట్రాలలో కూడా ఘనుల లీజులున్నాయి. అంతేకాకుండా ఇండోనేషియా దేశంలో కూడా మైనింగ్ వ్యాపారం చేస్తున్నారు. దీంతో రెండు చేతులా డబ్బు పుష్కలంగా సంపాదిస్తున్న సదరు నేత.. ఆ డబ్బులతో జగన్ వద్ద తన ప్రాభవాన్ని పెంచుకుంటున్నారనీ విమర్షలు వినిపిస్తున్నాయి. ఎంపిగా కాకమునుపే కోట్లకు పైగా ఫండ్ ను పార్టికి అందించినట్లు విశ్వసనీయ సమాచారం అందుతుండగా ఎన్నికలలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రోజా, అనీల్ యాదవ్ లకు పూర్తిస్థాయిలో ఆర్థిక సహకారం అందించి గెలిపించుకున్నట్లు సమాచారం. కాగా ప్రస్తుతం తన పరిది పెంచి చిత్తూరు, నెల్లూరు జిల్లాల అభ్యర్థులకు పూర్తి స్థాయిలో ప్రకాశం, కర్నూలు, కృష్ణా జిల్లాలతో పాటు అంతర్గతంగా తనకు సన్నిహితంగా వుండే నాయకులకు ఆర్థిక సహకారాన్ని అందజేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే అధిష్టానం నెల్లూరు, చిత్తూరు అభ్యర్థులకు మాత్రమే ఆర్థిక సహకారం అందించాలని చెప్పగా.. వేమిరెడ్డి మాత్రం తనకు అడిగిన ప్రతి ఒక్కరికి వీలైనంత సహకారం చేస్తుండటంతో వైసిపిలో ఆయన హవా రోజురోజుకు పెరిగితోంది.
పైసామే పరమాత్మ అనే ఇక్వేషన్ తో పార్టీలో గ్రాఫ్ అమాంతం పెంచుకుంటూ ముందుకు సాగుతోన్నవేమిరెడ్డి. వైవి సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి వంటి పలువురు కొర్ నేతలకు చెక్ పెట్టి తనకు పార్టీలో తనకు ఎదురేలేదనే వాయిస్ ను బలంగా వినిపిస్తున్నారు. దీంతో సదరు నేతలు డైలమాలో పడ్డట్టు సమాచారం. భవిష్యత్తులో జగన్, విజయసాయి రెడ్డి జైలుకు వెళితే పార్టీని టెకోవర్ చేసే దిశగా వేమిరెడ్డి అడగులు వేస్తున్నారని పార్టీ సీనియర్ నేత ఒకరు ఇందుకు సమాధానంగా చెప్పుకొస్తున్నారు. టెకోవర్ చేసే క్రమంలోనే అడిగినా, అడగకున్నా కీలక నాయకులకు డబ్బులు అప్పజెప్పుతున్నారనేది వారి వాదన. ఇదిలా ఉంటే నియోజక వర్గాల వారిగా పక్కా యాక్షన్ అమలు పరుస్తున్నారు వేమిరెడ్డి. ఇటీవల కావలిలో రెండు వర్గాల మధ్య గొడవ జరగ్గా.. విష్ణువర్ధన్ రెడ్డి ని పార్టీ వీడకుండా చూసే బాధ్యతను వేమిరెడ్డి తీసుకున్నారంట. ఓకవేల విష్ణువర్ధన్ పార్టీ వీడినా తమ వైపు పనిచేసేలా ఒప్పందం కూడా చేసుకున్నారట. మరో నియోజకవర్గం కొవ్వూరు లో కూడ వేమిరెడ్డి కీరోల్ పోషిస్తున్నారు. ఇక్కడి అభ్యర్తి ప్రసన్నకుమార్ రెడ్డి పూర్తి స్థాయిలో వేమిరెడ్డి పైనే ఆర్థికంగా ఆధారపడినట్లు సమాచారం. ఇక సూళ్లరుపేట, నాయుడు పేటతో పాటు ఇతర నియోజకవర్గాల్లో తన మనుషులు వుండేలా పార్టీ పై ఒత్తిడి తెస్తోన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఒక పక్క తనకంటూ ఓ వర్గాన్ని తయారు చేసుకుంటూనే.. మరో పక్క సేవా కార్యక్రమాలలో పాల్గొంటూ ప్రజలకు చేరువవుతున్నారు. జిల్లాలో మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ ఉచిత విద్యా వైద్యం వంటి సేవా కార్యక్రమాలు విస్త్రతంగా చేస్తున్నారు.
ఇలా అన్నీ కోణాల్లోనూ తన చాకచక్యాన్ని ప్రదర్శిస్తూ పార్టీలో జగన్ ఏతర ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్నారాయన. దీంతో జిల్లాల వైసీపీ నేతలంతా ఈయన వెనుక క్యూ కడుతున్నారు. మండల స్థాయి నాయకుల వరకూ కూడా ఆర్థికంగా సహాయం చేయడం వల్ల గ్రౌండ్ లెవల్ లో వేమిరెడ్డి తన ప్రభావాన్ని విస్త్రతం చేసుకుంటున్నారు. కాగా పార్టీలో వేమిరెడ్డి ప్రాభవం అంచెలంచెలుగా పెరుగుతుండడంతో జిల్లాకు చెందిన ఇతర సీనియర్ నేతలు తమ ఉనికిని కాపాడుకునే పనిలో పడుతున్నారు. పార్టికి ముందునుండి అండగా ఉంటూ పనిచేస్తుంటే కేవలం ఆర్ధిక అండదండలతో వేమిరెడ్డి తమకు అన్యాయం చేస్తున్నారనీ ఆవేదన చెందుతున్నారు. జరుగుతున్న పరిణామాలు ఎటుదారితీస్తాయో అవి పార్టికి ఎంతటి చేటు చేస్తాయోననీ అందోళన చెందుతున్నారు. మరి ఈ పరిస్తితులపై జగన్ ఎలా స్పందిస్తారో చూడాలి.