విధి ఎంత బలీయమైనదో, ఈ రోజు జగన్ మొహన్ రెడ్డికి తెలిసినంతగా, ఎవరికీ తెలిసి ఉందందు. ముందుగా, మన అమరావతిలో మరో ఆనందాల హడావిడి. గౌరవనీయులైన ప్రతిపక్ష నాయకుడు అడుగిడుతూ అమరావతిలో గృహప్రవేశం చేస్తున్న శుభవేళ. ఈ సందర్భంగా జగన్ మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు. ఇదే సందర్భంలో మన సాక్షిటీవీలో, పేపర్ లో, అమరావతి పై చిమ్మిన విషం ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. అమరావతి బురదలో, సిఎం బస్సు దిగబడితే నవ్వుకొన్నాం. ఉద్యోగులకు బురదే స్వాగతం చెప్పిందని చెణుకులు విసిరాం. అయినా ఒక్కొక్కటిగా సీఎం బస్సు నివాసంతో మొదలయ్యి, ఇటీవలే హైకోర్టు, ఆఖరుగా అపొజిషన్ లీడర్ నివాసం వరకు, అన్నీ తరలి వచ్చేశాయి.
భూములు ఇచ్చిన అన్నదాతలు భోజనానికి పిలిస్తే జగన్ రెడ్డి వెళ్లలేదని బాధపడ్డారు. ఈ రోజు ఆయన కూడా అమరావతి లో ఓ ఇంటివాడై భోజనం పెడుతున్నారు. ఇంతకంటే ఆనందం ఏముంటుంది. అమరావతి సంకల్పం, ఆ మట్టి అలాంటిది. అమరావతిలో అగ్నిపర్వతాలు బద్దలయ్యి లావా ఎగజిమ్ముతుంది అని రాయడం తప్ప, అన్ని ఉపద్రవాలు వస్తాయి అని సాక్షిలో నిత్యం వ్రాసి, కేసులు వేసారు. భూమి కుంగింది అని ఒకసారి, బురద నేల అని ఒకసారి, భూకంపం వస్తుందని ఒకసారి, ఇలా అనేకం. ఆ భయంతో, తోడు కోసమో ఏమో, ఇటుకే పెట్టలేదని ప్రచారం చేసి, అన్నీ సమకూర్చాక, ఇలా భారీ భవంతిని బ్రహ్మాండంగా కట్టుకొని, జగన్ రావడం సంతోషంగా వుంది.
భాగ్యనగరం బోసిపోయేలా ఆంధ్రా అంతా వచ్చేసింది, సినిమా & ఐటీ వాళ్లు తప్ప. వాళ్లకూ తప్పదనుకోండి. లోటస్ అంటే కలువ, పాండ్ అంటే కుంట, ఇదేదో మన కల్వకుంట్ల ఇంటి పేరుకు తగ్గదిలా వుందనుకొని, లోటస్ పాండ్ కు వెళుతున్న, అక్కడి సీఎం కుటుంబం కూడా, ఇక్కడికి వచ్చిపోయేలా, జగన్ స్వాగతించాలని ఆశిస్తున్నా. ఈ హడావుడితో, వందల నుండి వేలు దాటి, లక్షల మంది రాకపోకలతో అమరావతి అలరాలుతుంది. ఆ స్థాయిలో వ్యాపారాలు పెరుగుతాయి. చరిత్రలోని అమరావతికి, మరో సారి లోకం ఛత్రిపట్టే సన్నివేశాలు చూడ్డం, మన తరం అదృష్టం. అన్నదాతల నుండి ప్రణాళికలు ఇచ్చిన సింగపూర్ వరకు, ప్రతి ఒక్కరికీ, పేరు పేరునా ధన్యవాదాలు. మనం ఎంత విషం చిమ్మినా, అక్కడే ఇల్లు కట్టుకోవాల్సి రావటం, ఇది, ది పవర్ అఫ్ అమరావతి... ఇప్పటికైనా అర్ధమైందా జగన్ ?