విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ కేటాయించాలంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్‌కు లేఖ రాశారు. వాల్తేరు, విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్లు కలిపి విశాఖపట్నం కేంద్రంగా రైల్వేజోన్‌ను కేటాయించాలని అందులో కోరారు. రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీల్లో ఏపీకి ప్రత్యేక హోదాతోపాటు విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్‌ను కూడా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అయితే, గత నాలుగున్నరేళ్లుగా రైల్వే జోన్ ఏర్పాటు కాలేదు. వాల్తేరు డివిజన్ ప్రస్తుతం ఈస్ట్‌కోస్ట్ రైల్వే జోన్ పరిధిలో ఉంది. వాల్తేరు డివిజన్‌ను వదులుకోవడానికి ఒడిశా సిద్ధంగా లేదు. ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న వాల్తేరు డివిజన్ మీద ఈస్ట్‌కోస్ట్ రైల్వే పట్టుబట్టడంతో విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు ఆలస్యం అవుతోంది.
మార్చి ఒకటో తేదీన ప్రధాని నరేంద్ర మోదీ విశాఖలో పర్యటిస్తున్నారు. నగరంలో జరిగే ఓ సభలో పాల్గొంటారు. ఆ రోజు విశాఖ రైల్వే జోన్‌ను ప్రకటిస్తారంటూ ప్రచారం జరుగుతోంది. మొన్నటి దాకా, ఈ విషయంలో కేంద్రం, వెటకారం చేస్తూ వచ్చింది. రైల్వే జోన్ పై, పరిశీలించమని చట్టంలో ఉంది, మేము పరిశీలిస్తూనే ఉంటాం అంటూ, వెటకారంగా సమాధానం చెప్పారు. అయితే, నోటిఫికేషన్ వచ్చే వారం రోజులు ముందు, మోడీ వైజాగ్ వచ్చి, కొత్త డ్రామా ఆడనున్నారు అనే సంకేతాలు వస్తున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వారం రోజులు ముందు, మోడీ రైల్వే జోన్ ప్రకటించనున్నారు అని లీక్లు ఇస్తున్నారు. అంటే, కనీసం ఉత్తర్వులు ఇచ్చే టైం కూడా ప్రభుత్వానికి ఉండదు.
అయినా ప్రజలను మభ్యపెట్టటానికి, ఈ డ్రామా ఆడనున్నారు. ఇన్నాళ్ళు ఒక చిన్న నిర్ణయంతో ఏర్పాటు అయ్యే రైల్వే జోన్ విషయంలో, ఏపి మీద కక్షతో, ఇది దూరం పెట్టింది. అయితే వైజాగ్ ఎంపీ సీటు పై కన్ను వేసిన మోడీ, ఇక్కడ ప్రజలను బకరాలను చెయ్యటానికి, ఈ వ్యుహ్యం పన్నారు. వాల్తేరు డివిజన్‌ను తీసేసి మిగిలిన విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్లను కలిపి విజయవాడ కేంద్రంగా రైల్వే జోన్‌ను ఏర్పాటు చేస్తారనే ప్రచారం కూడా ఉంది. అయితే, విశాఖకు రైల్వే జోన్ అనేది ఉత్తరాంధ్ర వాసుల కల. ఏపీకి రైల్వేజోన్ అంటే.. అది విశాఖ కేంద్రంగానే ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో మోదీ ఎలాంటి కొత్త డ్రామా ఆడతారో చూడాలి.