తమ పార్టీ సానుభూతిపరుల ఓట్లను తొలగిస్తున్నారని ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీపై ఆరోపణలు చేయడం మామూలే. కానీ గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో తమ పార్టీ ఓట్లను తొలగించారని అధికార పార్టీ ఎమ్మెల్యే ఈసీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ అనుకున్నట్టే, కేసీఆర్, జగన్,మోడీ కలిసి తెలుగుదేశం ఓట్లు తొలగింపు చేస్తారని, తెలంగాణాలో లాగా, చేస్తారనే అనుమానాలు నిజం అయ్యాయి. ఆధారాలతో సహా దొరికిపోయారు. పొన్నూరు నియోజకవర్గంలో ఈ నెల 23, 24 తేదీలలో 5 వేల ఓట్లను తొలగించేలా వైసిపి నాయకులు అక్రమ మార్గంలో ప్రయత్నించారని తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్నికల అధికారులకు సోమవారం ఫిర్యాదు చేశారు.

narendra 25022019

పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్‌ మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం ఇచ్చిన స్పెషల్‌ డ్రైవ్‌ లో భాగంగా.. ఈ నెల 23, 24 తేదీల్లో పోలింగ్‌ బూత్‌లలో ఓట్ల నమోదు, తొలగింపు, బదిలీలకు సంబంధించిన దరఖాస్తులు అందజేయవలిసి ఉండగా... వైసిపి నాయకులు కుట్రలు, కుయుక్తులతో తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుల 5 వేల ఓట్లను తొలగించేలా ఆన్‌లైన్‌లో బల్క్‌ దరఖాస్తులు దాఖలు చేశారని ఆరోపించారు. ఎమ్మెల్యే నరేంద్ర కుమార్‌, టిడిపి నాయకులతో కలిసి పొన్నూరు నియోజకవర్గ ఎన్నికల అధికారిని కలిసి ఫిర్యాదు చేసేందుకు తహశీల్దార్‌ కార్యాలయానికి వెళ్లారు. ఎన్నికల అధికారి కొండయ్య, జిల్లా కలెక్టర్‌ తో సమావేశంలో ఉండటంతో.. ఎన్నికల అధికారితో ఫోన్లో సంప్రదించి ఆయన సూచనల మేరకు ఎన్నికల డిప్యూటీ తహశీల్దార్‌, సూపరింటెండెంట్లకు ఫిర్యాదు పత్రాన్ని అందజేశారు.

narendra 25022019

ఆన్‌లైన్‌లో ఒకే ఐపి అడ్రస్‌ తో దాఖలు చేసిన బల్క్‌, ఇన్‌ బల్క్‌ దరఖాస్తులను పరిగణలోనికి తీసుకోకూడదని టిడిపి నేతలు ఫిర్యాదు పత్రంలో పేర్కొన్నారు. సాముహిక ఓట్ల తొలగింపుకు పాల్పడిన దోషులను గుర్తించి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని టిడిపి నాయకులు డిమాండ్‌ చేశారు. బూత్ లెవెల్ అధికారులకు వైసీపీ నాయకులు ఒక్క దరఖాస్తు చేయలేదు కానీ, సుమారు ఐదు వేల ఓట్లను తీసివేయాలని కోరుతూ ఒకే ఐపీ అడ్రస్ నుంచి ఆన్ లైన్ లో దరఖాస్తు చేశారని ఆరోపించారు. ఎవరి పేరు మీద అయితే తమ ఓట్లు తొలగించాలని దరఖాస్తులు వచ్చాయో వారిని విచారిస్తే, అసలు, తాము దరఖాస్తు చేయలేదని చెప్పారని అన్నారు. ఈ నియోజకవర్గంలో ఓట్లు తొలగించాలన్న కుట్రలు చేస్తున్నారని వైసీపీ నాయకులపై ధూళిపాళ్ల మండిపడ్డారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read