మోదీ, కేసీఆర్, జగన్ వెయ్యి కోట్ల రూపాయల ప్యాకేజీతో రాష్ట్రంపై కుట్రలు ప్రారంభించారని చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేసారు. పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలతో ఆయన టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. రాష్ట్రంలో సామంత రాజు వ్యవస్థ తీసుకురావాలన్నదే వీరి ఆలోచనగా ఉందని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై ద్వేషం చూపిన కేసీఆర్, కేటీఆర్‌లు జగన్‌పై ప్రేమ చూపుతున్నారని.. రాష్ట్రాన్ని మరో బిహార్‌ చేసేందుకు ప్రశాంత్ కిశోర్‌ సాయంతో కుట్ర పన్నుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ఇలాంటివాటిని తెలుగుజాతి అంగీకరించదని స్పష్టం చేశారు. కుట్రలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.

cbn 250222019 2

‘అరాచక శక్తులు అధికారంలోకి వస్తే ఎక్కువ నష్టపోయేది వ్యాపారులే. ఇంట్లో కూర్చుని వ్యాపారం చేసుకునే పరిస్థితి ఉండదు. గల్లీకి ఒక రౌడీ తయారవుతాడు. ప్రతి దానికీ వాటా కట్టాలి. రాష్ట్రం ఎంత ప్రశాంతంగా ఉంటే వ్యాపారాలు అంత సజావుగా సాగుతాయి. వ్యాపారులంతా వీటిపై బహిరంగంగా మాట్లాడాలి’ అని సూచించారు.‘‘గతంలో నేనిచ్చిన పిలుపునకు స్పందించి హైదరాబాద్‌లో ఎంతోమంది పెట్టుబడులు పెట్టారు. కేసీఆర్‌ ఇప్పుడు వారందరికీ అడ్డదారిన నోటీసులు ఇస్తున్నారు. కేసులు పెడుతున్నారు. ‘మీరంతా ఆంధ్రప్రదేశ్‌ వెళ్లి జగన్‌కు అనుకూలంగా పనిచేయండి, ఎన్నికల్లో పోటీ చేయండి’ అని వారిని ఒత్తిడి చేస్తున్నారు. శాసనసభ్యుడు చింతమనేనిపై మార్ఫింగ్‌ పద్ధతిలో వీడియో, ఫొటోలు సృష్టించారు. కొండవీడు రైతు విషయంలో నాపై రాజకీయాలకు దిగి, పోలీసులను లక్ష్యంగా చేశారు. జగన్‌ సోదరి షర్మిల మన పోలీసులపై నమ్మకం లేక తెలంగాణలో కేసు పెట్టారు. కోడి కత్తి కేసులోనూ ఏపీ పోలీసుల్ని వారు నమ్మలేదు. వారికి ఆంధ్రప్రదేశ్‌పై నమ్మకం లేదు. ఇక్కడి ప్రజల ఓట్లు మాత్రం కావాలి’’ అని ముఖ్యమంత్రి తూర్పారబట్టారు.

cbn 250222019 3

‘జగన్‌కు ఎంత డబ్బు పిచ్చి అంటే.. రూ.10కోట్లు ఎవరు ఎక్కువ ఖర్చు పెడతామంటే వారికి సీట్లు ఇచ్చేస్తున్నారు. నిన్నటిదాకా పనిచేసిన వ్యక్తిని మార్చేసి కొత్తవారిని పెడుతున్నారు. ఇంత దిగజారుడు రాజకీయం ముందెప్పుడూ చూడలేదు’ అని విమర్శించారు. రాష్ట్రానికి అన్యాయం చేసి ఏ ముఖం పెట్టుకుని విశాఖపట్నం వస్తున్నారని మోదీని నిలదీయాలని ఆ జిల్లా ప్రజలకు సీఎం సూచించారు. ఆంధ్రప్రదేశ్‌ ఎక్కడ అభివృద్ధి అవుతుందోననే అభద్రత భావంతోనే రాష్ట్రంపై కేసీఆర్‌ కక్షగట్టారని విమర్శించారు. గత ఎన్నికల సమయంలో విశాఖపట్నంలో వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి సతీమణి విజయమ్మ పోటీ చేశారు. అప్పుడు కడప నుంచి కొంతమంది వచ్చి.. ఈ హోటల్‌ మాది.. ఈ క్లబ్‌ మాది.. మేమే అధికారంలోకి రాబోతున్నాం ఈ ఆస్తులు మావే అంటూ హడావుడి చేశారు. వీటన్నింటిపై విజ్ఞతతో ఆలోచించాలి. ‘సాక్షి’ పత్రికను గ్రామీణ ప్రాంతాల్లో ఉచితంగా వేస్తున్నారు. అందులో రాసేది చదివితే మన మెదళ్లు ఖరాబవుతాయి. అలాంటి పత్రికను బహిష్కరించాలి" అని పిలుపిచ్చారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read