పుల్వామా ఉగ్రదాడికి భారత్‌ ప్రతీకారం తీర్చుకుంది. ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళం విరుచుకుపడింది. సరిహద్దు నియంత్రణ రేఖ వెంబడి ఉగ్రవాద శిబిరాలపై బాంబులతో భీకర దాడి చేసింది. భారత వైమానిక బృందం ఈరోజు తెల్లవారుజామున 3:30 గంటలకు సుమారు వెయ్యి కిలోల పేలుడు పదార్థాలతో ఉగ్రక్యాంపులను ధ్వంసం చేసింది. 12 మిరాజ్‌-200 జైట్‌ ఫైటర్స్‌తో ఈ దాడి చేపట్టారు. ఈ నేపథ్యంలో భారత్‌, పాక్‌ సరిహద్దులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సరిహద్దులకు 50 కిలోమీటర్ల దూరంలోని పాకిస్థాన్ దేశంలోని ఖైబర్ ఫక్తూన్ ఖావా ప్రావిన్సులోని బాలకట్ పట్టణం వద్ద ఉగ్రవాదుల శిబిరాలపై దాడులు చేసినట్లు సమాచారం.

army 26022019 2

ఉగ్రవాదుల శిబిరాలను ధ్వంసం చేసినట్లు సమాచారం. 2016లోనూ ఉరి పట్టణంలోని ఆర్మీ బేస్ క్యాంపుపై ఉగ్రవాదుల దాడి అనంతరం మన సైనికులు సర్జికల్ స్ట్రైక్స్ చేశారు. బాలాకోట్, చాకోటి, ముజఫ్పరాబాద్ ప్రాంతాల్లోని జైషే మహ్మద్ ఉగ్రవాద శిబిరాలను భారత వాయుసేన ధ్వంసం చేసింది. అంతకు ముందు భారత వైమానిక దళం నియంత్రణ రేఖను దాటి పాక్‌ పరిధిలోకి రావడానికి ప్రయత్నించిందని.. పాకిస్థాన్ ఎయిర్‌‌ఫోర్స్ తక్షణమే తిప్పికొట్టడంతో వెనుదిరిగిందని పాకిస్థాన్ ఆర్మీ ప్రతినిధి, మేజర్ జనరల్ ఆసిఫ్ ఘఫూర్ ట్వీట్ చేశారు. పాకిస్తాన్‌లోని ముజఫరాబాద్ సెక్టార్‌లో భారత వైమానిక దళానికి చెందిన జెట్ ఫైటర్లు ప్రవేశించాయనేది ఆసిఫ్ ఆరోపించారు.

army 26022019 3

పుల్వామా ఉగ్రదాడి జరిగిన 12 రోజులకు పాక్‌ ఉగ్రశిబిరాలపై భారత్‌ ప్రతీకారం తీర్చుకుంది. ఈ నెల 14న జరిగిన పుల్వామా ఉగ్రదాడిలో 40మందికి పైగా సీఆర్పీఎఫ్‌ జవాన్లు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఉరి ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్‌ గతంలో విజయవంతంగా మెరుపుదాడులు నిర్వహించింది. 2016 సెప్టెంబర్‌ 29న నియంత్రణ రేఖను దాటి ఏడు ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేపట్టింది. మరో పక్క, పాకిస్థాన్ దేశంలోని ఉగ్రవాద శిబిరాలపై దాడిచేసిన భారత వాయుసేనను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అభినందించారు. ఉగ్రవాదుల శిబిరాలపై దాడులు చేసిన పైలెట్లకు శాల్యూట్ చేస్తున్నట్లు రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read