ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాశనం కోసం, హైదరాబాద్ నుంచి, జగన్ ను అడ్డు పెట్టుకుని స్కెచ్ వేసిన కేసీఆర్, అందుకు అనుగుణంగా తన ప్రయత్నాలు చేస్తున్నాడు. డైరెక్ట్ గా జగన్ తో కలిసి వస్తే, అది రాజకీయంగా దెబ్బ కొట్టి, జగనే కు అసలుకే ఎసరు వస్తుందని, డైరెక్ట్ గా కాకుండా, తెర వెనుక జగన్ కు సహాయం చేస్తున్నాడు. తెలంగాణా ఇంటెలిజెన్స్ మొత్తాన్ని ఏపి రాజకీయ నాయకుల పైనే పెట్టాడు. ఈ కోణంలోనే హైదరాబాద్ లో ఆస్థులు, వ్యాపారాలు ఉన్న తెలుగుదేశం నేతలని టార్గెట్ చేసుకుని, జగన్ పార్టీలో చేరమని, చంద్రబాబు పై తిరుగుబాటు చెయ్యమని ఒత్తిడి చేస్తున్నారు. ఈ కోవలోనే, అవంతి, మేడా, దాసరి జై రమేష్ లాంటి నేతలు ఈ ఒత్తిడి తట్టుకోలేక, జగన్ పార్టీలో చేరిపోయారు.
జగన్ పార్టీలో చేరని వారిని, అన్ని విధాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. చేతిలో అధికారం ఉండటంతో, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ, వారిని వేధిస్తున్నారు. ఐటి దాడులు చెయ్యటం, నోటీసులు పంపిచటం, పోలీసులతో బెదిరింపులు, ఇలా అన్ని రకాలుగా వేధిస్తున్నారు. ఈ కోవలోనే, తెలుగుదేశం పార్టీ ఎంపీ రాయపాటి సాంబశివరావుని టార్గెట్ చేసుకున్నారు. ఈ విషయం ఆయనే స్వయంగా మీడియాకు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రజాప్రతినిధులను తెలంగాణ సర్కార్ వేధిస్తోందని రాయపాటి సాంబశివరావు ఆరోపించారు. కేసీఆర్ ఒత్తిడి వల్లే కొంతమంది పార్టీ మారుతున్నారని అన్నారు. కేసీఆర్ నమ్మకద్రోహి అని, కేసీఆర్ బెదిరింపులకు లొంగేదిలేదన్నారు. మోదీ, కేసీఆర్, జగన్ కలిసినా చంద్రబాబును ఏమీ చేయలేరని ఆయన అన్నారు.
ఆయన మాట్లాడుతూ, తన కంపెనీలను ఎలా వేధిస్తుంది చెప్పూర్. "జూబ్లీహిల్స్ మెట్రోరైలు ఔటర్ రింగ్ రోడ్డు అంశాలలో దాదాపు 300 కోట్లు మా కంపెనీకి తెలంగాణ ప్రభుత్వం నష్ట పరిహారం ఇవ్వాల్సి ఉంది.... ఆంద్రా నేతలను బెదిరించి పార్టీలు మారమంటున్నారు...... ఆంద్రప్రదేశ్ లో ప్రతిపక్ష పార్టీ కి హైదరాబాద్ ఫార్మా కంపెనీలు చందాలు ఇవ్వాలని కేసిఆర్ హుకుం జారీ చేసారు..... లేకపోతే కేసుల్లో ఇరికిస్తామని బెదిరిస్తున్నారు.... ట్రాన్స్ ట్రాయ్ కి రావాల్సిన నష్ట పరిహారం కోసం కోర్టును ఆశ్రయించిన మాట వాస్తవం... నేను ఎవరికి భయపడను ...కావాల్సిన నష్ట పరిహారం కోర్టు ద్వారా వస్తాయన్న నమ్మకం ఉంది... తన కంపెనీ కి సంబందించి మెట్రో రైలు ప్రాజెక్ట కింద పరిహారం గా రావలసిన సుమారు 120 కోట్ల రూపాయలు మరియు ఔటర్ రింగ్ రోడ్డు లో కోల్పోయిన భూముల తాలూకా రావలసిన పరిహారం 163 కోట్లు కు అడ్డుపుల్ల వేసారు. రాయపాటి వచ్చి నన్ను కలిస్తేనే ఫైల్ క్లియర్ చేయాలని అధికారులకు కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారు. ఈ విషయం పై కోర్టను ఆశ్రయించాం" అంటూ రాయపాటి చెప్పుకొచ్చారు.