లోక్‌సభ అభ్యర్థుల ఎంపికపై టీడీపీ కసరత్తు ముమ్మరం చేసింది. గుంటూరు జిల్లా నరసరావుపేట లోక్‌సభ టీడీపీ అభ్యర్థి దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. అక్కడి సిట్టింగ్ ఎంపీ రాయపాటి సాంబశివరావుకే సీఎం చంద్రబాబు మరోసారి అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది. అయితే అధికారిక ప్రకటన రాలేదు. ప్రస్తుతం 25 లోక్‌సభ స్థానాల అభ్యర్థులపై సీఎం చంద్రబాబు కసరత్తు కొనసాగుతోంది. గెలిచే అభ్యర్థుల్నే ఎంపిక చేస్తున్నారు. ఇప్పటికే కొంతమందిని ఫైనల్ చేసినట్లు సమాచారం. ఇందులో భాగంగానే రాయపాటి సాంబశివరావును కూడా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. కాగా ఎంపీ రాయపాటి సాంబశివరావు.. తన కుమారుడుకు సీటు ఇవ్వాలని అడుగుతున్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం సీఎం చంద్రబాబును కలిశారు. తనకు ఎంపీ సీటుతో పాటు కుమారుడు రంగబాబుకు అసెంబ్లీ సీటు ఇవ్వాలని కోరినట్లు సమాచారం. అయితే రంగబాబు సీటు విషయాన్ని సీఎం చంద్రబాబు సందిగ్ధంలో పెట్టినట్లు తెలుస్తోంది.

police 13032019

సీఎం చంద్రబాబుతో మంత్రి శిద్దా రాఘరావు భేటీ అయ్యారు. ఎంపీగా పోటీ చేయాలని చంద్రబాబు శిద్దాకు సూచించారు. అయితే ఎంపీగా పోటీ చేసేందుకు శిద్దా విముకుత చూపినట్లు తెలుస్తోంది. భేటీ అనంతరం శిద్దా రాఘవరావు మాట్లాడుతూ ‘‘ నియోజకవర్గ కార్యకర్తలు ఎంపీగా పోటీ చేసేందుకు ఒప్పుకోవడం లేదు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినందున ఎమ్మెల్యే గానే పోటీ చేయాలని కార్యకర్తలు కోరుతున్నారు. ఇదే విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్ళాను. బుధవారం మరోసారి మాట్లాడుదమన్నారు. ఎంపీగా పోటీ చేయాల్సి వస్తే కుటంబ సభ్యులు అభిప్రాయం కూడా తీసుకోవాల్సి ఉంటుంది.’’ అని అన్నారు.

police 13032019

మరో పక్క, సీఎం చంద్రబాబును ఎంపీ ఎస్పీవై రెడ్డి కలిశారు. నంద్యాల పార్లమెంట్‌ స్థానానికి తన కూతురుకి అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు. అయితే మరోసారి భేటీ కావాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఎస్పీవై రెడ్డి మాట్లాడుతూ ‘‘మేం ఎంపీ టికెట్‌ మాత్రమే అడుగుతున్నాం. నంద్యాల ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లు ఇంకా ఖరారు కాలేదు. మహిళా కోటాలో నంద్యాల ఎంపీ టికెట్‌ నా కూతురికి అడిగాను. బుధవారం మరోసారి సీఎం చంద్రబాబును కలిసి ఎంపీ టికెట్‌ అడుగుతా.’’ అని ఎస్పీవై రెడ్డి అన్నారు. రాజమండ్రి ఎంపీ స్థానానికి బాలకృష్ణ చిన్నల్లుడి పేరు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి దంపతులు త్వరలో టీడీపీలో చేరనున్నారు. దీంతో ఆమెకు తిరుపతి పార్లమెంట్ స్థానాన్ని అధిష్టానం ఖరారు చేసింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read