మూడు దశాబ్దాల వైరాన్ని పక్కనపెట్టి వారిద్దరూ కలిసిపోయారు. 2 వర్గాలను ఏకం చేసి రా నున్న ఎన్నికల్లో విజయం సాధించే ప్రయత్నానికి నాంది పలికారు. రాష్ట్ర మంత్రి చదిపిరాళ్ల ఆదినారాయణరెడ్డి, మాజీ మంత్రి పి.రామసుబ్బారెడ్డి కుటుంబాల నడుమ దశాబ్దాలుగా వైరం ఉన్న సంగతి తెలిసిందే. రెండేళ్ల క్రితం వరకు ఈ వర్గాలు వేర్వేరు పార్టీల్లో ఉండేవి. వైసీపీ అధ్యక్షుడు జగన్‌తో విభేదించి ఆదినారాయణరెడ్డి టీడీపీలో చేరారు. అయినా ఉభయ వర్గాలూ కలవలేకపోయాయి. సీఎం చంద్రబాబు వీరిద్దరినీ సమాధానపరచి.. ఈ ఎన్నికల్లో కడప లోక్‌సభ స్థానంలో ఆదినారాయణరెడ్డిని, జమ్మలమడుగు అసెంబ్లీ స్థానంలో రామసుబ్బారెడ్డిని బరిలోకి దించారు. అయితే నేతలు కలిసినా.. అనుచరులు విభేదాలు మరచి కలిసి నడుస్తారా అన్న సందేహం ఉండేది.

thota 29102018 1

ఆ అనుమానాలను రెండు వర్గాలూ పటాపంచలు చేశాయి. జమ్మలమడుగులో బుధవారం నిర్వహించిన ‘ఆత్మీయ సమ్మేళనా’నికి ఇరు వర్గాల జనప్రవాహం కదిలి వచ్చింది. వీరి కలయికపై రెండు వర్గాల నేతలు హర్షం వ్యక్తంచేస్తున్నారు. ఆది, రామసుబ్బారెడ్డి కలయికతో ఈసారి కడప లోక్‌సభ స్థానాన్ని, జమ్మలమడుగు అసెంబ్లీ సీటును ఎలాగైనా దక్కించుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు భావించారు. రామసుబ్బారెడ్డిని ఎమ్మెల్యేగా, మంత్రి ఆది లోక్‌సభకు పోటీచేసేలా ఒప్పించారు. గత నెలలోనే టికెట్‌ ఖరారు చేసి ప్రచారం మొదలుపెట్టాలని సూచించినా.. ఎన్నో ఏళ్ల వైరాన్ని మనసులో పెట్టుకున్న వారి అనుచరులు.. కలిసేది లేదని భీష్మించుకున్నారు. మంత్రి ఆది, రామసుబ్బారెడ్డి తమ తమ వర్గాలతో విస్తృతంగా సమావేశాలు నిర్వహించారు.

thota 29102018 1

ఇందులో భాగంగానే బుధవారం జమ్మలమడుగులో ఇద్దరూ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. భారీ ర్యాలీ చేపట్టారు. నియోజకవర్గంలోని రెండు వర్గాల నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావడంతో జన ప్రవాహంగా మారింది. కార్యకర్తలు, నేతలు తమ మనసులోని భావాలను ఈ సందర్భంగా వెల్లడించారు. ‘ఘర్షణలతో అనుక్షణం భయంతో బతికాం. మా నేతలిద్దరూ కలిశారు. ఇక ప్రశాంత జీవనం సాగిస్తాం’ అని ఆనందం వ్యక్తం చేశారు. చంద్రబాబు చేసిన సయోధ్య ప్రయోగం జమ్మలమడుగులో విజయవంతమైందనడానికి ఆత్మీయ సమ్మేళనమే నిదర్శనమని టీడీపీ నేతలు పేర్కొంటున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read