ఎన్నికలకు 15 రోజుల ముందు, ఫీజ్ రీఇంబర్స్ మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల అధినేత, సినీ నటుడు మోహన్‌బాబు శుక్రవారం తిరుపతిలో విద్యార్థులు, తనయులతో కలసి నిరసనకు దిగిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో ఏ కాలేజీకి లేని బాధ, పాపం మోహన్ బాబు గారు ఒక్కరే పడుతున్నారు అనుకుంటా. అయితే, ఈ ఆరోపణల పై, తెలుగుదేశం స్పందించింది. ఫీజురీయింబర్స్‌మెంట్‌పై నిరసన తెలుపుతున్న మోహన్‌బాబుపై ఆంధ్రప్రదేశ్ ప్లానింగ్ కమిషన్ ఉపాధ్యక్షుడు కుటుంబరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ ఫీజురీయింబర్స్‌మెంట్‌పై మోహన్‌బాబు చీప్‌గా వ్యవహరించారని మండిపడ్డారు. మోహన్‌బాబు విద్యాదానం చేస్తున్నారా? లేక బిజినెస్‌ చేస్తున్నారా? అని ప్రశ్నించారు. ప్రభుత్వంపై ఆయన అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.

mohan 220320198 1

ప్రతిపక్షం అయిన వైసీపీకి మోహన్‌బాబు వంతపాడుతున్నారని, కక్షపూరితంగా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఐదేళ్లలో రూ.14,510 కోట్ల ఫీజురీయింబర్స్‌మెంట్‌ ఇచ్చామని చెప్పారు. మోహన్ బాబు బయట మాత్రం తన కాలేజీలో విద్యార్థులకు ఫ్రీగా చదివిస్తున్నానని, 25 శాతం మంది విద్యార్థులకు తానే ఫీజులు కడుతున్నానని చెబుతారని.. అలాంటప్పుడు ఫీజు రీయింబర్స్‌మెంట్ అడగడం ఎందుకని కటుంబరావు అన్నారు. ఆయనకున్న నాలుగు కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులందరికీ ఆయన ఫీజురీయింబర్స్‌మెంట్‌ వసూలు చేస్తారని ఆరోపించారు. మరి ఆయన ఉచితంగా ఎవరిని చదివిస్తున్నారని కుటుంబరావు ప్రశ్నించారు. ప్రజల్ని మభ్యపెట్టడానికే ఎన్నికల సమయంలో ప్రభుత్వంపై బురదజల్లేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. తాను చెప్పిన విషయాలపై బహిరంగ చర్చలకు సిద్ధమన్నారు. హామీల పేరుతో జగన్‌ గాలి మాటలు చెబుతున్నారని కుటుంబరావు విమర్శించారు.

mohan 220320198 1

కుటుంబరావు మాటల్లో "మోహన్ బాబుకు చెందిన నాలుగు విద్యా సంస్ధలకు ఇప్పటి వరకు రూ. 95 కోట్లు కేటాయించాం. రూ. 95 కోట్లల్లో ఇప్పటికే రూ. 88.57 కోట్లు రిలీజ్ చేశాం.. రూ. 6.43 కోట్లు పెండింగులో ఉన్నాయి. 2014-15 రూ. 7051, 2015-16 రూ. 2,69,000, 2016-17 రూ. 64 వేలు, 2017-18 రూ. 1.86 కోట్లు, 2018-19 రూ. 4.53 కోట్లు మాత్రమే బకాయిలు ఉన్నాయి. వాస్తవాలు ఈ విధంగా ఉంటే మోహన్ బాబుకు ఎందుకు ఆదుర్దా..? ముందుగా ఫీజ్ రీ-ఇంబర్స్మెంట్ చేయాలని ఎలా అంటారు..? మోహన్ బాబు వ్యాపారం చేస్తున్నారా..? విద్యా సంస్ధను నడుపుతున్నారా..? రాష్ట్రంలో ఏ కాలేజీకి డబ్బులివ్వనట్టు మోహన్ బాబు మాట్లాడుతున్నారు. మోహన్ బాబు ఆరోపణలపై చర్చకు సిద్దం. 2014 నుంచి ఒక్క పైసా రాలేదని ఎలా చెబుతారు..? మోహన్ బాబుకు విద్యా దాన కర్ణుడిననే పేరు కావాలి. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ తీసుకుని మోహన్ బాబు విద్యా దాన కర్ణుడిలా ఫోజు కొడుతున్నారు. సొసైటీలో పెద్ద మనిషిలా ఉన్న మోహన్ బాబు నాన్సెన్స్ మాట్లాడ్డం సరికాదు. *మోహన్ బాబుపై చాలా గౌరవం ఉండేది.. ఇప్పుడు లీస్ట్ రెస్పాక్ట్ ఇస్తున్నాం. పొలిటికల్ మోటీవ్ కన్పిస్తోంది. ఓ పార్టీ తరపున తాను కానీ.. తన కుమార్తె కానీ పోటీ చేస్తారని గతంలోనే చెప్పారు.. ఇప్పుడు ఆయన ఏ పార్టీ సానుభూతి పరుడో అర్ధమవుతోంది." అని అన్నారు.

 

Advertisements

Advertisements

Latest Articles

Most Read