నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో హైకోర్టు కార్యకలాపాలు మొదలయ్యాయి. నేలపాడులో కొత్తగా నిర్మించిన జ్యుడీషియల్‌ కాంప్లెక్స్‌ భవనంలో హైకోర్టు సోమవారం నుంచి విధులు ప్రారంభించింది. న్యాయవాదులు, చుట్టుపక్కల గ్రామస్థులు భారీగా తరలిరావడంతో కోర్టు ప్రాంగణం సందడిగా కనిపించింది. తొలిరోజు కావడంతో న్యాయమూర్తులు, న్యాయవాదులు కోర్టు విధుల కంటే గంట ముందుగానే భవనానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌తోపాటు మిగిలిన న్యాయమూర్తులకు న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, నేలపాడు గ్రామస్థులు సాదర స్వాగతం పలికారు. భవన సముదాయంలో ఏర్పాటైన హైకోర్టు అడ్వకేట్స్‌ అసోసియేషన్‌, మహిళా న్యాయవాదల అసోసియేషన్‌ హాళ్లను ప్రధాన న్యాయమూర్తి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం న్యాయమూర్తులు, ఏజీ తదితరులంతా తమకు కేటాయించిన చాంబర్లలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. హైకోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన క్యాంటీన్‌ను సీజే ప్రవీణ్‌కుమార్‌ ప్రారంభించారు.

radha 19032019

నూతన భవనంలో తొలిరోజు విధులు కావడంతో న్యాయవాదులు భారీగా తరలివచ్చారు. కేసులు లేకపోయినా నూతన భవనాన్ని వీక్షించేందుకు సుదూర ప్రాంతాల నుంచి వచ్చారు. భవనం మొత్తం తిరుగుతూ ఏ అంతస్తులో ఏఏ విభాగాలున్నాయో తెలుసుకుంటూ, తక్కువ కాలంలో త్వరితగతిన నిర్మితమైన భవనం గురించి చర్చించుకుంటూ కనిపించారు. పని చేయని ఏసీలు: తొలిరోజు కోర్టు విధులు ప్రారంభమైనా సుమారు గంటపాటు వివిధ కోర్టుల్లో ఏసీలు పని చేయలేదు. దీంతో న్యాయమూర్తులు, న్యాయవాదులు అల్లాడిపోయారు. అసలే వేసవి, అందులోనూ నల్లకోటు ధరించి ఉండడంతో ఉక్కపోతతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయినా ఎక్కడా ఆ అసంతృప్తి కనిపించనీయకుండా న్యాయమూర్తులు చిరునవ్వుతోనే విధులు నిర్వర్తించడం విశేషం. ఇదిలా ఉండగా గోవా ముఖ్యమంత్రి పర్రీకర్‌ మృతికి సంతాప సూచకంగా హైకోర్టు ముందున్న జాతీయ పతాకాన్ని అవనతం చేశారు.

radha 19032019

నేలపాడు రైతుల విందు... తమ ప్రాంతంలో హైకోర్టు ప్రారంభమైందన్న ఆనందంలో రాజధానికి భూములిచ్చిన నేలపాడు రైతులు సోమవారం మధ్యాహ్నం భోజనాలు ఏర్పాటు చేశారు. న్యాయమూర్తుల నుంచి కోర్టుకొచ్చిన అందరికీ సుమారు 2వేల మంది వరకూ వారు విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. ‘ఎలాంటి గుర్తింపు లేని మా ప్రాంతానికి సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయంవల్ల రాజధాని అయింది. సరిగా బస్‌ సౌకర్యమే లేని మా గ్రామానికి వందల సంఖ్యలో బస్సులు, కార్లు, ఇతర వాహనాలు వచ్చిపోతుంటే ఆనందంతో నోట మాట రావడం లేదు’ అని వారు సంతోషం వ్యక్తం చేశారు.

 

 

Advertisements

Advertisements

Latest Articles

Most Read