లేపాక్షి మాజీ ఎంపీపీ, టీడీపీ నాయకులు కొండూరు మల్లికార్జున పార్టీ వీడుతారన్న సమాచారం లేపాక్షిలో కలకలం రేపింది. పార్టీకి విధేయుడైన మల్లికార్జునకు పార్టీలో సరైన ప్రాధాన్యత ఇవ్వలేదన్న అలక బూని వైసీపీలోకి వెళ్తారన్న సమాచారం మంగళవారం రాత్రి గుప్పుమంది. ఈనేపథ్యంలో అహుడా చైర్మన్ అంబికా లక్ష్మీనారాయణ, పార్టీ కోఆర్టీనేటర్ శ్రీనివాసరావులు బుధవారం ఉదయం రంగంలోకి దిగారు. కొండూరు వెళ్లి మల్లికార్జున స్వగృహంలో సుదీర్గంగా చర్చలు జరిపారు. పార్టీ ఆవిర్బావం నుంచి టీడీపీలో ఉన్నా తనతోపాటు నావెంట నడిచే నాయకులు, కార్యకర్తలకు సముచిత న్యాయం చేయలేదని ఆవేదన వ్యక్త పరిచినట్లు తెలుస్తోంది. పార్టీలో సీనియర్‌గా ఉన్నా తనుకు గర్తింపు ఏది అని ప్రశ్నంచినట్లు తెలుస్తోంది.
గుర్తింపు లేనప్పుడు పార్టీలో ఎందుకు ఉండాలని తనపై నాయకులు, కార్యకర్తలు ఒత్తిడి తీసుకువచ్చినట్లు అంబికా, శ్రీనివాసరావు వద్ద వెల్లడించినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఎమ్మెల్యే బాలయ్యతో నేరుగా మల్లికార్జునతో మాట్లాడించారు. ఎమ్మెల్యే తనకు న్యాయం చేస్తామని భరోసా ఇవ్వడంతో పార్టీ మారే అలోచనలు లేదని మల్లికార్జున తేల్చి చెప్పారు. కోండూరుకు చిలమత్తూరు నాయకులు చంద్రదండు రాష్ట్ర ఉపాధ్యక్షులు అన్సార్అహ్మద్, లేపాక్షి ఎంపీపీ హనోక్, నాయకులు చలపతి, రామాంజినమ్మ, శివప్ప చర్చంచారు. అయితే మల్లికార్జున పార్టీ మారుతారన్న సమాచారం హిందూపురంలో హాట్ టాపిక్‌గా మారింది.