రివాల్వర్‌తో గాల్లోకి కాల్పులు జరిపిన కేసులో మాజీ ఎమ్మెల్సీ హెచ్‌.ఎ.రెహ్మాన్‌కు 3 సంవత్సరాల నెల పాటు జైలు శిక్ష విధిస్తూ 17వ అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు తీర్పునిచ్చింది. దీంతోపాటు రూ. 5 వేల జరిమానా విధించింది. వివరాల్లోకి వెళ్తే.. 2011 జూన్‌ 15న ఉమ్మడి రాష్ట్ర ఉప ఎన్నికల్లో వైసీపీ 15 సీట్లను గెలుచుకుంది. దీంతో పార్టీ శ్రేణులు జూబ్లీహిల్స్‌ రోడ్డు నెంబరు 45లోని వైసీపీ కార్యాలయంలో బాణసంచా కాలుస్తూ.. వేడుకలు నిర్వహించారు. అప్పటి ఎమ్మెల్సీ హెచ్‌.ఎ.రెహ్మాన్‌ను పార్టీ కార్యకర్తలు ఎత్తుకోవడంతో.. ఆయన ఆనందం పట్టలేక.. జేబులో ఉన్న లైసెన్స్‌డ్‌ రివాల్వర్‌తో 3 రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపాడు.

madhav 20032019

ఆ సమయంలో అక్కడే విధినిర్వహణలో ఉన్న జూబ్లీహిల్స్‌ ఎస్సై కె.సైదులు (ప్రస్తుతం నల్లకుంట డీఐ).. రెహ్మాన్‌ తన రివాల్వర్‌తో కాల్పులు జరిపిన విషయాన్ని నిర్ధారించుకుని.. ఆయనపై ఐపీసీ 336, ఆయుధ చట్టంలోని సెక్షన్‌ 27(1) ప్రకారం కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఫిర్యాదుదారు, సాక్షి కూడా ఆయనే. పక్కా ఆధారాలతో కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేశారు. సైదులు ఒక్కడే సాక్షి కావడంతో.. ఈ కేసు వీగిపోతుందని అంతా భావించారు. కానీ.. సాక్ష్యా ధారాల సేకరణతోపాటు.. కోర్టులో పక్కాగా వాదనలు చేయడం, కౌంటర్లు దాఖలు చేయడం, డిఫెన్స్‌ లాయర్‌ క్రాస్‌ ఎగ్జామినేషన్‌లో తడబాటు లేకుండా సమాధానాలిచ్చారు. కేసు పూర్వాపరాలు పరిశీలించిన న్యాయమూర్తి బి.శ్రీనివాసరావు.. రెహ్మాన్‌ కాల్పులు జరిపింది వాస్తమేనని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ వాదనతో ఏకీభవిస్తూ శిక్షను ఖరారు చేశారు.

 

Advertisements

Advertisements

Latest Articles

Most Read