తెదేపా రెండో విడత అభ్యర్థుల జాబితాను శనివారం అర్థరాత్రి దాటిన తరువాత విడుదల చేసింది. మొత్తం 15 శాసనసభ నియోజకవర్గాలకు అభ్యర్థుల్ని ఖరారు చేసింది. మరో 34 నియోజకవర్గాలను పెండింగ్‌లో పెట్టింది. చిత్తూరు నియోజకవర్గానికి సిట్టింగ్ ఎమ్మెల్యే సత్యప్రభ స్థానంలో ఏఎస్ మనోహర్‌కు చోటు కల్పించారు. ఈ నేపథ్యంలో సత్యప్రభను రాజంపేట లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయించే అవకాశం ఉంది. మదనపల్లె తనకు కేటాయించాలని వైకాపా సిట్టింగ్ ఎమ్మెల్యే దేశాయి తిప్పారెడ్డి చంద్రబాబును సంప్రదించినా తెదేపాకు చెందిన దమ్మాలపాటి రమేష్‌కే అభ్యర్థిత్వం దక్కింది. అనంతపురం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని కొన్ని శాసనసభ నియోజకవర్గాల అభ్యర్థుల్ని మార్చాలని జేసీ దివాకర్‌రెడ్డి ఒత్తిడి చేయడంతో 4 స్థానాలను పెండింగ్‌లో పెట్టి, దాని పరిధిలోని 3 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించారు. మిగతా వాటిలో మెజార్టీ స్థానాలకు సిట్టింగ్‌లకే పార్టీ అవకాశం కల్పించింది.
రెండో జాబితా వివరాలు 1. పాలకొండ- నిమ్మల జయకృష్ణ 2. పిఠాపురం- ఎన్‌వీఎస్‌ఎన్ వర్మ 3. రంపచోడవరం- వంతల రాజేశ్వరి 4. ఉంగుటూరు- గన్ని వీరాంజనేయులు 5. పెడన- కాగిత వెంకటకృష్ణ ప్రసాద్ 6. పామర్రు- ఉప్పులేటి కల్పన 7. సూళ్లూరుపేట- పరసావెంకటరత్నం 8. నందికొట్కూరు- బండి జయరాజు 9. బనగానపల్లె- బిసి జనార్దన్‌రెడ్డి 10. రాయదుర్గ్- కాల్వ శ్రీనివాసులు 11. ఉరవకొండ- పయ్యావుల కేశవ్ 12. తాడిపత్రి- జేసీ అస్మిత్‌రెడ్డి 13. మడకశిర- కె.ఈరన్న 14. మదనపల్లి- దమ్మాలపాటి రమేష్ 15. చిత్తూరు- ఏఎస్ మనోహర్