ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల జోరు మొదలయ్యింది. నేతలు తమ తమ పార్టీలకి ప్రచారం లో బిజీ గా ఉన్నారు.. కాలంతో పోటీ పడుతూ ప్రచారం చేస్తున్నారు పార్టీ అధినేతలు. ఇక ఈ సంధర్భంగా ఎన్నికల ప్రచారం చేయాడానికి రాధా సిద్ధం అయ్యారు. మాజీ ఎమ్మెల్యే రాధ టీడీపీ లోకి వచ్చిన విషయం తెలిసిందే.. అయితే ఈ సంధర్భంగా టీడీపీ తరఫున ప్రచారం చేయాడానికి ఆయన రంగం సిద్ధం చేసుకున్నారు.. ఎన్నికల వేళ బెజవాడలో అరుదైన కలయిక. టీడీపీ తరపున ప్రచారంలోవంగవీటి రాధా…విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఇద్దరూ కలవడం అరుదైన కలయికగా భావిస్తున్నారు టీడీపీ కార్యకర్తలు. ఎంపీ కేశినేని నాని కూడా వీరితో కలవడం గమనార్హం.
ఎనిమిదవ డివిజన్ ఫన్ టైమ్స్ క్లబ్ లో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసిన టీడీపీ నేతలతో సమావేశానికి హాజరైయ్యారు మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా, కేశినేని నాని, గద్దెరామ్మోహన్. ఈ సంధర్భంగా ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ.. టీడీపీ లోకి రాధా రావడం పార్టీకి మరింత బలాన్ని చేకూర్చింది. రాధా ప్రచారంతో తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్ధుల మెజార్టీ రెట్టింపు అవుతుంది. తాతల నాటి నుంచి రాధా కుటుంబంతో మాకు సన్నిహిత సంబంధాలున్నాయి. అందరం సమన్వయంతో పని చేసి రానున్న ఎన్నికలలో విజయవాడలో ప్రతిపక్షం లేకుండా చేస్తాం..అని ఆయన అన్నారు.
ఇక మైక్ అందుకున్న వంగవీటి రాధా మాట్లాడుతూ.. బెజవాడలో ప్రశాంత వాతావరణం ఉండాలంటే ప్రజాప్రితినిధులే కాకుండా ప్రజలు కూడా సహకరించాలి. అభివృద్ది, సంక్షేమం కోసం టీడీపీకి అండగా ఉండాల్సిన బాధ్యత మనందరి పైనా ఉంది. అందరం కలసి కట్టుగా ఉండి తూర్పు నియోజకవర్గంలో జిల్లాలోనే అత్యధిక మెజార్టీ సాధించాలి…టీడీపీ అభ్యర్ధులను గెలిపించడానికి నావంతు కృషి చేస్తాను అని ఆయన బదులిచ్చారు.