రామ్ గోపాల్ వర్మ వివాదాస్పద మూవీ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా విడుదలకు అడ్డంకులు తొలిగాయి. ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా లక్ష్మీపార్వతి కోణంలో వర్మ రూపొందించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రాన్ని అనేక వివాదాలు చుట్టిముట్టాయి. ముఖ్యంగా చంద్రబాబుని టార్గెట్ చేస్తూ.. మామ ఎన్టీఆర్‌ని వెన్నుపోటు పొడిచి ఆయన్ని మానసిక క్షోభకు గురిచేశారంటూ వాస్తవ ప్రపంచానికి తెలియని నిజాలను ఈ సినిమాలో చూపించబోతున్నానంటూ టీజర్, ట్రైలర్, ప్రమోషన్ పోస్టర్స్, వీడియోలతో అగ్గిరాజేశారు వర్మ. ఇక ఎన్నికలకు మరో నెలరోజులు మాత్రమే సమయం ఉండటంతో ఇప్పుడు ఈ సినిమా పై అనవసర రాద్ధాంతం లేకుండా చూస్తున్నారు.

jagna list 17032019

ఈ తరుణంలో చంద్రబాబుకి, తెలుగుదేశం పార్టీకి ప్రతికూల అంశాలతో నింపేసిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా విడుదలైతే దాని ఎఫెక్ట్ ఖచ్చితంగా ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం ఉండటంతో ఆ సినిమా విడుదలను ఆపేయాలని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు టీడీపీ శ్రేణులు. ఎన్నికలు తొలిదశ పూర్తయ్యే వరకూ లక్ష్మీస్ ఎన్టీఆర్ అడ్డుకోవాలని టీడీపీకి చెందిని సాధినేని యామిని తదితరులు ఈసీని కలిసి ఫిర్యాదు చేసిని విషయం తెలిసిందే. మార్చి 22న ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ ఎలాంటి
నిర్ణయం తీసుకోబోతున్నారు? అసలు ఈ సినిమా విడుదల అవుతుందా లేదా అన్న ఉత్కంఠకు తెరపడింది. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం విడుదలకు సెన్సార్ బోర్డు అభ్యంతరం చెప్పింది.

jagna list 17032019

ఎన్నికల సంఘం ఆదేశాల నేపథ్యంలో ఈ సినిమా విడుదలపై నిర్ణయం తీసుకున్నట్టు సెన్సార్ బోర్డు వర్గాలు తెలిపాయి. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం ఎన్నికల సమయంలో రిలీజైతే టీడీపీకి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందంటూ దేవీబాబు అనే టీడీపీ కార్యకర్త ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎన్నికల సంఘం సెన్సార్ బోర్డుకు పలు సూచనలు చేసింది. ఈ నేపథ్యంలోనే లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రబృందానికి సెన్సార్ బోర్డు నుంచి ఆదేశాలు వెళ్లాయి. ఎన్నికలు పూర్తయ్యాక సినిమాను విడుదల చేసుకోవచ్చంటూ సెన్సార్ వర్గాలు సూచించాయి. దీనిపై స్పందించిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ న్యాయపోరాటం చేస్తానంటూ ట్వీట్ చేశారు. ఎన్టీఆర్ జీవితంలో లక్ష్మీపార్వతి ప్రవేశించడానికి గల కారణాలు, ఆమె ప్రవేశించిన తర్వాత ఎన్టీఆర్ జీవితంలో వచ్చిన మార్పులు లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో ప్రధాన ఇతివృత్తం.

Advertisements

Advertisements

Latest Articles

Most Read