వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభ అభ్యర్థుల తొలి జాబితాను ఆ పార్టీ శనివారం విడుదల చేసింది. రెండో జాబితాను వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. రేపు(ఆదివారం) ఇడుపులపాయలో ప్రకటించే అవకాశం ఉంది. లోక్‌సభ అభ‍్యర్థుల తొలి జాబితాను ప్రకటన అనంతరం పార్టీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి మాట్లాడుతూ... రాబోయే ఎన్నికలలో తమ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌, కోర్ కమిటీ అన్ని రకాలుగా చర్చించి 175 అసెంబ్లీ, 25 ఎంపీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేసినట్లు తెలిపారు. మంచి ముహుర్తం అని చెప్పడంతో ఇవాళ తొమ్మిదిమందితో తొలి జాబితా, మిగిలిన స్థానాలను రేపు ఇడుపులపాయలో వైఎస్‌ జగన్‌ ప్రకటిస్తారని తెలిపారు.

jagan 16032019

ప్రస్తుతం ప్రకటించిన తొమ్మిది మంది అభ్యర్థుల జాబితాలో గత ఎన్నికల్లో విజయం సాధించిన పెద్దిరెడ్డి మిథున్‌ రెడ్డి, వైఎస్‌ అవినాష్‌ రెడ్డికి మరోసారి అవకాశం కల్పించారు. అలాగే ఇద్దరి మహిళలకు అవకాశం కల్పించారు. విడుదల చేసిన తొలి జాబితాలో రెండు ఓసీ, ఒక ఎస్టీ, మూడు బీసీ, మూడు ఎస్సీ అభ్యర్థులకు వైఎస్సార్ సీపీ ప్రాతినిధ‍్యం కల్పించింది. అరకు - గొడ్డేటి మాధవి, అమలాపురం- చింతా అనురాధ, రాజంపేట- పెద్దిరెడ్డి మిథున్‌ రెడ్డి, కడప- వైఎస్‌ అవినాష్‌ రెడ్డి, హిందుపురం - గోరంట్ల మాధవ్, అనంతపురం - తలారి రంగయ్య, బాపట్ల - నందిగం సురేష్‌, చిత్తూరు- నల్లకొండగారి రెడ్డప్ప, కర్నూలు - డాక్టర్‌ సంజీవ్‌ కుమార్‌.

Advertisements

Advertisements

Latest Articles

Most Read