ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార టీడీపీ మళ్లీ గెలిస్తే కలిగే లాభాలేంటి. ఒకవేళ రాక పోతే కలిగే నష్టాలేంటి... అనే అంశంపై విజయవాడకు చెందిన ఓ విద్యావంతుల బృందం వినూత్నంగా ప్రచారం చేస్తోంది. కొందరు విద్యావంతులు కలిసి ఓ బృందంగా ఏర్పడ్డారు. సోషల్ మీడియా, ఇతర మార్గాల ద్వారా ప్రచారం చేస్తున్నారు. తెలుగుదేశం మళ్లీ వస్తే ఆంధ్రులు తొలిసారి తమ గడ్డపై నిర్మించుకుంటున్న రాజధాని అమరావతి దేశంలోనే అధునాతన నగరంగా రూపుదిద్దుకుంటుంది. పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది. కృష్ణా, గోదావరి డెల్టాతో పాటు వాటిని అనుకుని ఉన్న జిల్లాలకు సాగునీటి భద్రత ఏర్పడుతుందని విద్యావంతుల బృదం ప్రచారం చేస్తోంది. అంతేకాదు పంచమ నదులు సంగమం ఆచరణ రూపం దాల్చుతుంది. నాగావళి, వంశదార, గోదావరిల్లోని మిగులు జలాలతో సీమ వరకు సాగునీరు అందుతుంది. కేంద్రంలో బీజేపీయేతర ప్రభుత్వం ఏర్పడితే చంద్రబాబు పలుకుబడితో హోదా వస్తుంది. నిర్మాణంలో ఉన్నవి, ప్రతిపాదనలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు త్వరగా పూర్తవుతాయి. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, హంద్రీనీవా, గాలేరు నగరి పూర్తవుతాయి. స్థిరమయిన విధానాలు, ప్రారిశ్రామిక అనుకూల ప్రభుత్వం కొనసాగడం వల్ల ఇప్పటికే వచ్చిన పరిశ్రమలతో పాటు కొత్త పరిశ్రమలొస్తాయి. వాటి అనుబంధ పరిశ్రమలు వేగంగా వస్తాయి. ఉద్యోగ అవకాశాలతో పాటు భూముల రేట్లు పెరుగుతాయి. చంద్రబాబు దూరదృష్టి నిర్ణయాల వల్ల రాష్ట్ర వృద్ధి రేటు బాగా పెరుగుతుంది. దీని వల్ల ప్రభుత్వ ఆదాయం పెరుగుతుంది. రాష్ట్రంలో ఐటీ, ఎలక్ట్రానిక్ పరిశ్రమలు పెరుగడానికి ఇప్పటికే పడిన పునాది బలపడుతుంది.
చంద్రబాబు మళ్లీ వస్తారో.. లేదో అని తమ నిర్ణయాలు పెండింగ్లో పెట్టుకున్న పారిశ్రామిక వేత్తలు, సంస్థలు, విదేశీ పెట్టిబడిదారులు ఆయన మళ్లీ ఐదేళ్లు ఉంటారని తెలిస్తే ధైర్యంగా పెట్టుబడులు పెట్టాడానికి ముందుకు వస్తారు. టీడీపీ మళ్లీ గెలువకపోతే ఏం జరుగుతుందో కూడా విద్యావంతుల బృందం వివరిస్తోంది. టీడీపీ రాకపోతే అమరావతి నిర్మాణంపై నీలినీడలు కమ్ముకుంటాయి. ప్రాధాన్యాలు మారి అమరావతిపై ఇప్పటి వరకు ఉన్న ఆలోచనలు వెనక్కి పోతాయి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వేగం కూడా తగ్గుతుంది. ఇది చంద్రబాబుకు పేరు తెచ్చిన ప్రాజెక్టు అనే కారణంగా డిజైన్ల మార్పు, కాంట్రాక్ట్ సంస్థల మార్పు వంటి ప్రతిపాదనలతో దాని రూపురేఖలు మార్చే ప్రయత్నం జరుగుతుంది. దీనివల్ల జాప్యం జరుగుతుంది. నదుల అనుసంధానం సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో కూడా ప్రాధాన్యాలు మారిపోతాయి. తమకు పేరు రావాలన్న తపనలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న వాటిని పక్కకు పెట్టి కొత్తవాటిని ముందుకు తెచ్చే అవకాశం ఉంది. తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత ఇదే జరిగింది. దీనివల్ల పాతవి ఆగిపోతాయి. కొత్తవి అందుబాటులోకి రావడానికి సమయం పడుతుంది. సంక్షేమ పథకాల్లో కూడా మార్పుచేర్పులు మారుతాయి. పాత ప్రభుత్వ ముద్ర ఉన్న వాటివి కాకుండా తమకు పేరు తెచ్చేవి కావాలన్న తాపాయత్రంతో కొత్తపథకాలు ప్రవేశపెడుతారు. వీటికి డబ్బులు లేక పాతపథకాలు అటకెక్కుతాయి. దీని వల్ల పేదలు నష్టపోయే ప్రమాదం ఉంది.
ఏపీ ప్రభుత్వంపై తెలంగాణ సర్కార్ ప్రభావం పెరుగుతుంది. తమకు ఇబ్బంది అనుకున్న పథకాలు, లేదా కార్యక్రమాల్ని తెలంగాణ ప్రభుత్వం పరోక్షంగా నిలిపివేస్తుంది. లేదా వేగం తగ్గేలా చూస్తుంది. ఉమ్మడి రాజధానిలోని ఆస్తుల విభజనపై ఏపీ ప్రభుత్వం తన ఒత్తిడిని తగ్గించుకొనే ప్రమాదం ఉంది. సుమారు లక్ష కోట్ల విలువైన ఆస్తులపై వాటా కోల్పేయే అవకాశం ఉంది. టీఆర్ఎస్ మద్దతుతో పీఠమెక్కే వైసీపీ తెలంగాణ ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించే పనులకు దిగలేదు. ఏపీ ప్రభుత్వంలో కేసీఆర్ పలుకుబడి వల్ల హైదరాబాద్లోని ఆంధ్రులపై టీఆర్ఎస్ పట్టు మరింత పెరుగుతుంది. పారిశ్రామికవేత్తలు, స్థిరాస్థి వ్యాపారులు అక్కడ ఆస్తులున్న వారు కేసీఆర్కు లోబడి ఉండాల్సి వస్తుంది. జగన్పై సీబీఐ కేసులు వల్ల కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్న వైసీపీ సర్దుకుపోయే దోరణితో వ్యవహరించాల్సి ఉంటుంది. రాష్ట్ర హక్కులు, అవసరాలపై వైసీపీ గట్టిగా అడగలేదు, పోరాడలేదు. అందుకు విద్యావంతుల బృందం మళ్లీ చంద్రబాబే సీఎం కావాలని ప్రచారం చేస్తోంది. అంతేకాదు ఓటర్లను చైతన్య పరుస్తోంది.