భిన్న ధృవాలు ఏకమయ్యాయి. ఆత్మీయ ఆలింగనంతో మనస్పర్థలు తొలగిపోయాయి. ఇద్దరు ప్రధాన నాయకుల మధ్య భేదాభిప్రాయాలకు జలీల్‌ఖాన్‌ కుమార్తె, పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షబానా ఖాతూన్‌ తెరదించారు. ఆమె మంగళవారం మాజీ మేయర్‌ మల్లికా బేగం నివాసానికి వెళ్లి మద్దతు కోరారు. షబానాను ఆహ్వానించిన మల్లికా బేగం ఆత్మీయ ఆలింగనం చేసుకుని, షబానా నోరు తీపి చేసి, ప్రచార విశేషాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఓటుతో పాటు ప్రచారంలో మద్దతును కూడా ఇవ్వాలని మల్లికాబేగంను షబానా కోరారు. ఓటు కోసం ఒక నాడు తాను కూడా ఎన్నో గుమ్మాలు ఎక్కి దిగానని, తప్పక మద్దతునిస్తానని మల్లిక మాట ఇవ్వడంతో టీడీపీ వర్గాల్లో ఆనందం వెల్లివిరిసింది.

aadala 16032019

ఫత్వాతోనే విభేదాలు... జలీల్‌ఖాన్‌, మల్లికా బేగం మధ్య 2004లో ఫత్వా వివాదం మొదలైంది. ముస్లిం మహిళలు రాజకీయాల్లోకి రాకూడదని ముస్లిం మత పెద్దలు అప్పట్లో జారీ చేసిన ఫత్వాకు జలీల్‌ మద్దతు పలికినా మల్లికాబేగం పెద్దగా స్పందించలేదు. తరువాత జలీల్‌ఖాన్‌ సైతం ఆ ఫత్వాను పట్టించుకోకపోయినా ఇద్దరి మధ్యా అభిప్రాయభేదాలు మాత్రం అలాగే ఉండిపోయాయి. ఇదంతా 15 ఏళ్లనాటి మాట. అదే ఫత్వా వివాదం మరోసారి మల్లికా బేగం, షబానాల మధ్య ఇటీవల మళ్లీ తలెత్తింది. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్న షబానా మంగళవారం భర్త జమీర్‌తో కలిసి వెళ్లి, మల్లికాబేగంను కలిశారు. వారిని ఆత్మీయంగా ఆహ్వానించిన మల్లికా బేగం ఆలింగనంతో ఆశీర్వదించారు. అనంతరం మద్దతుగా ప్రచారానికి రావడంపై కూడా హామీ ఇచ్చారు.

aadala 16032019

లగడపాటి మార్క్‌ సయోధ్య.. మల్లికాబేగంను కలిసే విషయమై జలీల్‌ఖాన్‌ సోమవారం లగడపాటి రాజగోపాల్‌ను కలిశారు. పలు అంశాలపై చర్చించిన అనంతరం జలీల్‌ఖాన్‌ తనను కలవాలనుకుంటున్నారన్న సమాచారం లగడపాటి కార్యాలయం నుంచి మల్లికాబేగంకు అందింది. అందుకు తనకు అభ్యంతరమేమీ లేదని ఆమె తెలిపారు. దీంతో షబానా మల్లికాబేగంను కలుసుకున్నారు. ఇరు వర్గీయులు ఒక్కడవడం స్థానికంగా టీడీపీ కార్యకర్తల్లో ఆనందాన్ని నింపింది.

 

 

Advertisements

Advertisements

Latest Articles

Most Read